The Goat Life : ఆడుజీవితం మాస్ కలెక్షన్స్.. ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం ఉందా?

The Goat Life : గత కొంత కాలంగా మలయాళం నుండి ఎలాంటి సినిమాలు వచ్చినా హిట్ అయి కూర్చుంటున్నాయి. అవి ఏ జోనర్ అయినా, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు కంటెంట్ నచ్చితే అమాంతం పైకి లేపేస్తున్నారు మలయాళం ప్రేక్షకులు. ఇక మళయాళంతో పాటు తెలుగులో కూడా ప్రేమలు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. త్వరలో మంజుమ్మేల్ బాయ్స్ తెలుగులో కూడా రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ఇక లాస్ట్ వీక్ మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన మరో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తుంది. ఈ సినిమా కూడా అంచనాలని మించి బాక్స్ ఆఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుంది. మామూలుగా హిట్లు కాకుండా ఏకంగా బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో అక్కడ సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. అలాగే లేటెస్ట్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం)(The Goat Life) క్రిటిక్స్ నుండి అద్బుతమైన పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర
సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టిల్లు స్క్వేర్ మూవీతో పోటి వలన అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది.

తెలుగు వెర్షన్ లెక్కేస్తే..

ది గోట్ లైఫ్ సినిమా మొత్తం మీద తెలుగు వెర్షన్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో నిరాశ కలిగించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా కలెక్షన్స్ నైజాం లో 55 లక్షలు, ఆంధ్ర లో 35 లక్షలు కలిపి 90 లక్షల వరకు షేర్ సాధించింది. 2 కోట్ల వరకు గ్రాస్ ఉంటుంది. ఇక తెలుగులో వాల్యూ టార్గెట్ 1.80 కోట్ల దాకా ఉండగా సగం రికవరీని మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచింది. అయితే టిల్లు స్క్వేర్ కనుక పోటీ గా లేకపోయుంటే ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయిపోయేది. ఈ క్రమంలో మలయాళంలో మాత్రం ఆడు జీవితం అదరగొట్టిందని చెప్పాలి. పృత్విరాజ్ సుకుమారన్ పెర్ఫార్మన్స్ కి అక్కడి ప్రేక్షకులు ముగ్దులైపోయి కలెక్షన్లలో బ్రహ్మరధం పట్టారు.

ఫస్ట్ వీక్ రచ్చ.. ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

ఇక ది గోట్ లైఫ్ సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే కేరళ 34.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.10 కోట్లు, తమిళనాడు లో 5.85 కోట్లు, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 6.65 కోట్లు, ఓవర్సీస్ లో ఏకంగా 37. 60 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మొదటివారం వరల్డ్ వైడ్ గా 87.10 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేయగా 38.90 కోట్ల షేర్ ని సాధించింది. మొత్తం మీద సినిమా మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్ల రేంజ్ లో ఉండగా, దాని మీద ఓవరాల్ గా 13 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ అయింది. లాంగ్ రన్ లో 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. అన్ని కుదిరితే ఈ సినిమా కూడా 200 కోట్ల వసూళ్లు అందుకుని ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే దానికి ఇతర సినిమాల నుండి పోటీ ఉండకూడదు. మరి రెండో వారం చూడాలి ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు