Mrunal Thakur : మృణాల్ సంపాదనంతా ఏం చేస్తుందో తెలుసా?

Mrunal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పూర్తిగా ఇక్కడే సెటిల్ అయిపోయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ చిన్నది రీసెంట్ గా రిలీజ్ “హాయ్ నాన్న” మూవీతో మరింత పాపులారిటీని దక్కించుకుంది. నాని హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ నటనకు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ భామ. ఏప్రిల్ 5న రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మృణాల్ కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్స్ అంటూ తెగ సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రుణాలు. అలాగే తన సంపాదన అంతా ఏం చేస్తుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టింది.

ఇదే చివరి తెలుగు సినిమా…

ఇంటర్వ్యూలో ముందుగా తెలుగులో తాను నటించిన ఫస్ట్ మూవీ సీతారామం షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంది మృణాల్. నిజానికి ఆ సినిమాలో చేసే సమయానికి తనకు తెలుగు రాదని, అయినప్పటికీ తెలుగు డైలాగ్ లను ఇంగ్లీషులో రాసుకుని మరీ ప్రాక్టీస్ చేశానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ పాత్ర అంత సహజంగా వచ్చిందని వెల్లడించింది. అయితే తన మాతృ భాష మరాఠీలో కన్నా తెలుగు డైలాగులు చెప్పడమే కష్టంగా అనిపించిందని, అందుకే అప్పుడు షూటింగ్ లో తన పక్కన ఉన్న హీరో దుల్కర్ సల్మాన్ తో ఇదే తన చివరి తెలుగు సినిమా అని చెప్పాననే విషయాన్ని మరోమారు గుర్తు చేసుకుంది. కానీ దుల్కర్ ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి అంటూ తనను ఎంకరేజ్ చేశారని, మూవీ రిలీజ్ అయ్యాక ఆయన చెప్పిందే నిజమైందని ఆనందం వ్యక్తం చేసింది మృణాల్.

మృణాల్ సంపాదనను అంతా ఏం చేస్తుందంటే?

ఇక ఈ ఇంటర్వ్యూలోనే సినిమాల్లో తను కష్టపడి సంపాదించిన సంపాదనను అంతా ఎక్కువగా బంగారం, స్థిరాస్తులు లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పుకొచ్చింది. సాధారణంగా అమ్మాయిలు బట్టల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ మృణాల్ మాత్రం డిఫరెంట్. ఆమె దగ్గర ఉన్న ఖరీదైన డ్రెస్ ధర కేవలం రూ.2 వేలేనని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ ఆడంబరాలకు పోకుండా సాదాసీదా లైఫ్ ను ఇష్టపడుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఈవెంట్స్ లో ,మృణాల్ వేసుకునే బట్టలన్నీ ఫ్యాషన్ డిజైనర్స్ ఇచ్చినవనని తెలుస్తోంది. మొత్తానికి తన ఆస్తుల గురించి, సంపాదన గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది ఈ బ్యూటీ మరి “ఫ్యామిలీ స్టార్”తో ఈ ఫ్రైడే మృణాల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు