Chiranjaveei : మలయాళం సినిమా రీమేక్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ సినిమాలో నటించడానికి రెడీ అవబోతున్నడంట. ఇప్పటికే తమిళ్ రీమేక్ సినిమాగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా తరువాత, మరో మలయాళం సినిమా రీమేక్ కి మెగాస్టార్ ఓకే చెప్పాడని సమాచారం.

మెగా ఫ్యామిలీలో రీమేక్ సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. స్ట్రయిట్ సినిమా తీసి, ప్లాప్ ఎదురైన ప్రతిసారి రీమేక్ సినిమాలే మళ్ళీ విళ్ళాని హిట్ ట్రాక్ లో పడేసాయి. సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది కూడా రీమేక్ సినిమాతోనే, రామ్ చరణ్ కూడా ఆ మధ్య శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ సినిమా ప్లాప్ తరువాత తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ (ధృవ) సినిమాని రీమేక్ చేసి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే స్ట్రయిట్ సినిమాలకన్న రీమేక్ సినిమాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

అయితే మెగాస్టార్ రీమేక్ చేయబోయే ఆ మలయాళ సినిమా ఏంటో తెల్సా మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వచ్చిన “బ్రో డాడీ “. ఈ సినిమా గతేడాది డిస్ని హాట్ స్టార్ లో రిలీజైయింది. ఫ్యామిలీ ఫన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓటిటిలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత చిరు ఏ సినిమా చేయబోతున్నాడు అనేది ఇంకా తేలాల్సిఉంది. ఇటీవలనే చాలా మంది యంగ్ డైరెక్టర్స్ చిరంజీవిని కలిసి కథలు వినిపిస్తున్నరంట. అయితే చిరంజీవి మాత్రం అన్ని కథలకి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారని సమాచారం. బంగార్రాజు సినిమా ఫెమ్ కళ్యాణ్ కృష్ణ , బింబిసార ఫెమ్ వశిస్ట్ తో మెగాస్టార్ తరువాత సినిమా ఒకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లలో ఒక సినిమా రీమేక్ అనే వార్త వినిపిస్తోంది. ఆ రీమేక్ బ్రో డాడీ సినిమానే అని ఫిలింనగర్ టాక్. అయితే బ్రో డాడీ రీమేక్ లో మోహన్ లాల్ క్యారెక్టర్, చిరంజీవి పోషిస్తారని, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ లో సిద్దు జొన్నలగడ్డ నటిస్తాడనే రూమర్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. మరి దీనిలో నిజమెంతనో తెలియలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు