Rajinikanth: ఒక్క పోస్టర్ తో అంచనాలు పెంచేసిన లాల్ సలాం

జైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ గ్లిమ్ప్స్ తో షేక్ చేసిన రజినీకాంత్ వారం తిరక్కుండానే మరో సాలిడ్ అప్డేట్ తో వచ్చి ఫ్యాన్స్ ని సప్రైజ్ చేసాడు. వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో పాటు నటిస్తున్న మరో చిత్రం లాల్ సలాం. చాలా మందికి రజినీకాంత్ ఈ సినిమా చేస్తున్నాడని తెలియదు. అందరు రజినీకాంత్ జైలర్ మీదే ఫోకస్ పెట్టారు. అయితే రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలాం మూవీని డైరెక్ట్ చేస్తుంది స్వయంగా ఆయన కూతురైన ” ఐశ్వర్య”.

రజినీకాంత్ కూతురుగా ఇండస్ట్రీ లో పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు శాఖల్లో పని చేసింది. తన సోదరి సౌందర్యతో కలిసి గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేసింది. 2004 లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా “3” మూవీని డైరెక్ట్ చేసింది. మొదటి సినిమాతోనే దర్శకురాలిగా తన ప్రతిభ చూపించి విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద 3 మూవీ ప్లాప్ అయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు డైరెక్ట్ చేసింది ఐశ్వర్య.

ఇప్పుడు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్ తో లాల్ సలాం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మే7 న లైకా ప్రొడక్షన్ వారు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రజినీకాంత్ ముస్లిం సాంప్రదాయ దుస్తుల్లో స్టైల్ గా నడుస్తున్నట్టు ఉన్నారు. ఇక రజినీకాంత్ పాత్ర పేరు “మొయిదీన్ భాయ్” అని రివీల్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ తో లాల్ సలాం మూవీని ఒక్కసారిగా ట్రెండింగ్ లో నిలిపారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ప్రత్యేక పాత్రలో మాత్రమే నటిస్తున్నారంటూ, హీరోగా చేయట్లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో నిజమెంతో చిత్ర యూనిట్ తెలియచేయాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు