RAPO : బోయపాటి, రామ్ పోతినేని మూవీ అప్డేట్ !

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ తుది దశకి చేరుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ధమాకా బ్యూటీ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే రామ్ పోతినేని కెరియర్ బిగినింగ్ నుంచే మాస్ హీరో ఇమేజ్ కోసం గట్టిగ ట్రై చేస్తున్నాడు. కానీ లుక్స్ పరంగా రామ్ క్లాస్ గా కనిపించటంతో, మాస్ హీరోగా నిలబడలేకపోయాడు. దాంతో తనకి సూట్ అయ్యే లవ్ స్టోరీస్ నే చేస్తూ హిట్స్ అందుకున్నాడు. అయితే 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తొలిసారిగా కమర్షియల్ మాస్ హిట్ ని అందుకున్నారు.

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో రామ్ వెంటనే తమిళ్ లో సూపర్ హిట్ అయిన తాడం సినిమాని రెడ్ పేరుతో రీమేక్ చేసారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత రామ్ తమిళ్ డైరెక్టర్ యన్ లింగుస్వామి దర్శకత్వంలో “ది వారియర్” అనే బై లాంగ్వేజికల్ సినిమాలో నటించారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా, రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇష్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ ని రామ్ సరిగా వినియోగించుకోలేదు అని కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ విషయాన్నే మైండ్ లో పెట్టుకున్న రామ్ తన తరువాత సినిమాకి బోయపాటితో కొలాబరేట్ అయ్యారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. డబ్బింగ్ పనులు కూడా మొదలైపోయాయి.వచ్చే అక్టోబర్ 20న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రామ్ ఇష్మార్ట్ శంకర్ లాంటి సాలిడ్ హిట్ కొడతాడో, లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు