Custody: ఫస్ట్ కిస్ సమంతతోనే కానీ, నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

సమంత, నాగ చైతన్య, దాదాపు 7 నుంచి 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2017లో వివాహంతో ఒక్కటైయ్యారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లీ పీటలేక్కిన ఈ జంట ఎక్కువ రోజులు కలిసి లేదు. ఈ ప్రేమ, పెళ్లి మూన్నాళ్ల ముచ్చట అన్నట్టు, పెళ్లై మూడేళ్లు కాకముందే డైవర్స్ తీసుకుంది ఈ జంట. విడాకుల తర్వాత, విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ ఎప్పుడు చెప్పలేదు.

అయితే, ఈ టాపిక్ వీరి నుంచి, ముఖ్యంగా సమంత నుంచి తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో వచ్చేది. ప్రేక్షకుల్లో సింపతి కోసం సినిమాలు విడుదలయ్యే సమయంలో సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కొంత ఆరోపణ కూడా ఉంది. కానీ, నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరకు సమంత గురించి గానీ, వాళ్లు విడిపోవడం గురించి గానీ, ఎప్పుడు పెదవి విప్పలేదు. కానీ, ప్రస్తుతం నాగ చైతన్య నటించిన కస్టడి మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చైతన్యతో పాటు చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ సందర్భంలోనే సమంత గురించి, తమ డైవర్స్ గురించి కీలక విషయాలను నాగ చైతన్య వెల్లడిస్తున్నాడు. ఇటీవల సమంతను లవ్లీ ఉమెన్ అని అన్న నాగ చైతన్య, తాజాగా మరోసారి సామ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఆన్ స్క్రీన్ లో మొదటి సారి కిస్ చేసింది సమంతకే అని చెప్పాడు నాగ చైతన్య. ఏ మాయ చేసావే సినిమా సమయంలో సమంతకి ఒక సీన్ లో కిస్ పెట్టినట్టు తెలిపాడు. కానీ, ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఎప్పుడు, ఎవరికి పెట్టానే అనేది మాత్రం ఇప్పుడే చెప్పాలేనంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

- Advertisement -

అలాగే తన ఫస్ట్ లవ్ ఏడవ తరగతిలోనే స్టార్ట్ అయిందని, అప్పుడు తన క్లాస్ లో ఉన్న అమ్మాయిని ఇష్టపడినట్టు తెలిపాడు. అలాగే ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కాఫీ డేట్ కి వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. అయితే సమంత గురించి మాట్లాడటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపని నాగ చైతన్య, ప్రస్తుతం సందర్భం వచ్చిన ప్రతిసారి సమంత పేరు తీస్తున్నాడు. మరి ఇది సమంతపై పెరిగిన ప్రేమా ? లేదా కస్టడి ప్రమోషన్స్ లో భాగంగా ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికా ? అనేది ఇప్పుడు అభిమానులకు ప్రశ్నగా మారింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు