Bollywood Star in Kannappa : కన్నప్ప జోరు… మరో స్టార్ కాస్ట్ ఎంట్రీ..!

Bollywood Star in Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప.. ఇప్పటికే ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ చేరిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సరికొత్తగా మరికొంతమంది స్టార్స్ భాగం కానున్నారు.. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోతున్నాయి.. రూ.100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తూ ఉండగా శివుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఇందులో ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు.. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇకపోతే ఇందులో బాలీవుడ్ స్టార్ భాగం కానున్నట్లు సమాచారం..

కన్నప్పలో బాలీవుడ్ హీరో..

ఆయన ఎవరో కాదు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాజాగా అక్షయ్ కుమార్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో కలిసి అక్షయ్ చేసిన బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అక్షయ కుమార్ కన్నప్ప సినిమా సెట్ లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.. ఇక త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన కూడా పోస్టర్ తో సహా వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Akshay Kumar in Kannappa
Akshay Kumar in Kannappa

కన్నప్పలో స్టార్ క్యాస్ట్..

ఇకపోతే ఈ సినిమాలో భారీతారాగణం భాగమైన విషయం తెలిసిందే. వారిలో ముఖ్యంగా మోహన్ బాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార , హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సీనియర్ హీరో శరత్ కుమార్, ప్రముఖ హీరోయిన్ మధుబాల వంటి వారు ఇందులో భాగమయ్యారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమాకి పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, బుర్ర సాయి మాధవ్ డైలాగులు అందిస్తూ ఉండగా స్క్రిప్ట్ వర్క్ కూడా మరో పక్క చేస్తూ ఉండడం విశేషం.. ఇక సంగీత దర్శకులుగా మణిశర్మ , స్టీఫెన్ దేవస్సీ వ్యవహరిస్తున్నారు..

- Advertisement -

కన్నప్ప ఫస్ట్ లుక్ పై భారీ రెస్పాన్స్..

ఇకపోతే మొన్నా మధ్య కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అభిమానులలో చాలా మంచి స్పందన లభించింది.. మంచి విష్ణు స్పందిస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు చాలా భయపడ్డాను.. నేను ఎప్పుడు ఇలాంటి రోల్ చేయలేదు.. అంతా ఈశ్వరేచ్ఛ.. ఆయన ఆశీర్వాదం వల్లే కన్నప్ప సినిమా చేయగలుగుతున్నాను.. ఇక ఈ సినిమా హిస్టరీ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు.. తెలుగు , కన్నడ వాళ్లే కాదు తమిళ్ , మలయాళం వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు.. ఇక నార్త్ నుంచి అయితే ఊహించని ప్రశ్నలు నాకు ఎదురవుతున్నాయి.. వాళ్లకి కన్నప్ప గురించి పూర్తిగా తెలియదు కాబట్టే నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక కన్నప్ప గురించి శ్రీకాళహస్తి స్టోరీ గురించి చెప్పే అవకాశం నాకు దక్కింది అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.. మొత్తానికైతే భారీతారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు