Naga Chaitanya : చైతూను బెదిరిస్తున్న హీరోయిన్‌ ?

Heroine Warns Naga Chaitanya:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వారసత్వాన్ని అందిపుచ్చుకొని పైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలా వారసత్వాన్ని అందిపుచ్చుకొని పైకి వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరికొంతమంది మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే నందమూరి అలాగే అక్కినేని కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో అక్కినేని నాగచైతన్య ఒకరు. అక్కినేని నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.

అందంతోపాటు చాలా వినయం ఉన్న నటుడు అక్కినేని నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు నాగచైతన్య. తన కెరీర్ ప్రారంభంలో జోష్ అనే సినిమా చేశాడు నాగచైతన్య. ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో 2009 సంవత్సరంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో… కాస్త పొలిటికల్ టచ్ ఉన్న సినిమానే జోష్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా అక్కినేని నాగచైతన్యకు మంచి పేరు వచ్చింది.

జోష్ సినిమా అనంతరం నేరుగా లవ్ ట్రాక్ ఉన్న సినిమా చేశాడు నాగచైతన్య. ఏం మాయ చేసావే అనే సినిమాతో మరో బంపర్ విజయాన్ని అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా అక్కినేని నాగచైతన్య హీరోగా చేశాడు. ఇంకేంది ఈ సినిమా సక్సెస్ కావడమే కాకుండా ఇదే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య మరియు సమంత ప్రేమలో పడ్డారు.

- Advertisement -

సినిమా పూర్తి అయ్యేలోపు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలేరు. అప్పట్లో సమంత మరియు నాగచైతన్య ప్రేమ గురించి రకరకాల వార్తలు కూడా వచ్చాయి. వాస్తవానికి తమిళ ఇండస్ట్రీలో సిద్ధార్థ ను మొదటగా ప్రేమించింది అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సిద్ధార్థ మరియు సమంత విడిపోయారు. ఇంకేముంది అదే సమయంలో నాగచైతన్య పరిచయం అయ్యాడు. దీంతో నాగచైతన్య మరియు సమంత ఇద్దరు ప్రేమించుకున్నారు.

దాదాపు 5 సంవత్సరాలపాటు వీరిద్దరి ప్రేమ నడిచింది. అయితే 2017 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నా అనంతరం కాపురం బాగానే చేసి చివరికి హ్యాండ్ ఇచ్చుకున్నారు. 2021 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత చిన్నచిన్న కారణాల వల్ల విడిపోయారు. ఇప్పటికే ఆ కారణాలను మాత్రం సమంత మరియు నాగచైతన్య ఎక్కడ కూడా చెప్పడానికి భయపడుతున్నారు.

Samantha Naga Chaitanya
Samantha Naga Chaitanya

ఇదంతా పక్కకు పెడితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. వీరిద్దరూ ప్రేమ విషయాన్ని సమంత మొదటగా తమ ఇంట్లో చెప్పిందట. అయితే అక్కినేని నాగార్జునకు భయపడి… ప్రేమ విషయాన్ని నాగచైతన్య ఇంట్లో చెప్పలేదట. ఈ తరుణంలోనే నీకు రాఖీ కట్టేస్తానని నాగచైతన్యను చాలా ఇబ్బంది పెట్టిందట సమంత. దీంతో బెదిరిపోయిన నాగచైతన్య… వెంటనే తమ ప్రేమ విషయాన్ని నాగార్జునకు చెప్పారట. ఆ తర్వాత వీరి… ప్రేమ వివాహం జరగడం ఆ తర్వాత… విడాకులు కూడా జరగడం చూశాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు