Sandeep Reddy Vanga Update on Spirit : క్రేజీ అప్డేట్ ఇచ్చిన వంగా… ఫస్ట్ డే 150 కోట్లు గ్యారంటీ

Sandeep Reddy Vanga Update on Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల్లో జోష్ ను పెంచే అప్డేట్ ను తాజాగా వెల్లడించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఇచ్చిన క్రేజీ అప్డేట్ నిజమైతే మొదటి రోజే స్పిరిట్ మూవీ 150 కోట్లను కొల్లగొట్టడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు ఈ డాషింగ్ డైరెక్టర్. మరి ఇంతకీ స్పిరిట్ గురించి సందీప్ రెడ్డి వంగా పంచుకున్న విశేషాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్తే…

“స్పిరిట్” స్టోరీ చెప్పేసిన డైరెక్టర్

రీసెంట్ గా యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీని ప్రభాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో మొదటిసారి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోస్ట్ వయోలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మూవీ కావడంతో స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు సందీప్. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన దగ్గర పని చేస్తున్న ఓ వ్యక్తి చేసిన తప్పుకు ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నదే కథ అంటూ సింపుల్ గా చెప్పుకొచ్చారు. కానీ ఆయన మేకింగ్, టేకింగ్ ఇంటర్వ్యూలో చెప్పినంత సింపుల్ గా ఉండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఫస్ట్ డే స్పిరిట్ కు 150 కోట్లు పక్కా…

ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు 60 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ పూర్తి చేసి షూటింగ్ మొదలు పెడతామని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సందీప్. అంతేకాదు ఈ మూవీని 300 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నామని, టీజర్, ట్రైలర్ అనుకున్న విధంగా ఆడియన్స్ కు రీచ్ అయ్యిందంటే ప్రభాస్ ఇమేజ్ కి మొదటి రోజే 150 కోట్లు రావడం ఖాయమని సందీప్ రెడ్డి వంగ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు యానిమల్ మూవీ కంటే ముందే ప్రభాస్ కి ఈ మూవీ స్క్రిప్ట్ ని వివరించారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కరోనా టైం లోనే స్టోరీ చెప్పగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

- Advertisement -

సందీప్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే…

యానిమల్ మూవీతో దాదాపు 900 కోట్లు కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ను లైన్లో పెట్టారు.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే…

గత ఏడాది డిసెంబర్లో సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన కల్కి మూవీ మే 30న రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అనంతరం సలార్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక మూవీ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు