Telugu Actress: రెండో సారి పెళ్లి పీటలెక్కిన అమలాపాల్!

టాలీవుడ్ లో పాగా వేసిన మలయాళం హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. పన్నెండేళ్ల కిందట బెజవాడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమల, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకునే అమలాపాల్ కి హిట్లు కరువవడం తో పెద్దగా గుర్తింపు రాలేదు.అందుకే వేరే
ఇండస్ట్రీ లో బిజీ అయింది.

ఇక అమలా పాల్ 2014 లో A.L విజయ్ అనే తమిళ్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు బాగానే కలిసున్నా అభిప్రాయ భేదాల కారణంగా 2017 లో విడాకులు తీసుకున్నారు.

అప్పట్నుంచి సింగిల్ గానే ఉన్న అమల తన సినిమాలతో బిజీ అయింది. అయితే తాజాగా అమల టూరిజం, హాస్పెటలిటీ స్పెషలిస్ట్ అయిన జగత్ దేశాయ్ ని పెళ్లి చేసుకుంది. కొచ్చి లో వీరి వివాహం జరగగా, జగత్ దేశాయ్ “టూ సోల్స్ వన్ డెస్టినీ” , నా జీవిత భాగస్వామితో కలిసి నడుస్తున్నాను, ఈ జీవితాంతం’ అని కాప్షన్ పెట్టాడు.

- Advertisement -

ఇక రీసెంట్ గా అమలాపాల్ బర్త్ డే సందర్బంగా గోవాలో జగత్ దేశాయ్ తనకి లవ్ ప్రపొస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటారని ఆడియన్స్ ఊహించలేదు.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు