Mrunal Thakur: హాయ్ నాన్న నా కెరియర్ బెస్ట్ ఫిలిం

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన “సీతారామం” సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు హిందీలో జెర్సీ సినిమాలో నటించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో పెద్ద హిట్ అయిన జెర్సీ సినిమా హిందీ రీమేక్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈమెకి ఛాన్సులు తగ్గాయి.

Read More: Hi Nanna: ఖర్చుకు తగ్గొద్దు కాసులు కురుస్తాయి.

తెలుగులో సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ ని ఎక్కడో నిలబెట్టింది సీతారామం హిట్ తర్వాత నాని, విజయ్ దేవరకొండ సినిమాల్లో అవకాశాలను సాధించుకుంది. మొదట సీతారామం సినిమాకి మృణాల్ ఠాకూర్ ప్లేస్ లో వేరే హీరోయిన్ ని అనుకున్నాడు హను రాఘవపూడి. అప్పటికే “ప్రాజెక్టు కే” లో చేయాల్సిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకి బాగుంటుందని, నాగ్ అశ్విన్ సజెస్ట్ వలన సీతారామం ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.

- Advertisement -

Read More:Hi Nanna: మ్యూజిక్ అంటే ఎలివేషన్స్ మాత్రమే కాదు..!

మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిపోయింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. అలానే నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఇప్పటికే పలు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

రీసెంట్ జరిగిన ఒక కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ పాల్గొని ఈ సినిమా తనకి మంచి ప్లస్ అవుతుందని, తనలోని కంప్లీట్ టాలెంట్ ని ఈ సినిమాలో చూస్తారని చెప్పుకొచ్చింది. అలానే ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలిపింది. నాని నాచురల్ యాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఇకపై చేసే సినిమాలతో ఏ స్థాయికి వెళుతుందో తెలియాలి అంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు