Amala Paul Comments: కాబోయే వాడు గురించి హాట్ కామెంట్స్ చేసిన హీరోయిన్

Amala Paul Comments

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ కుట్టి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళం నుండి హీరోయిన్ గా ఎదిగిన అమలాపాల్.. భాషతో సంబంధం లేకుండా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్, తెలుగు, కన్నడలో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్ డమ్ రాలేదు. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో అడపాదడపా సినిమాలు తీస్తుంది.

ఇక అమలాపాల్ పెళ్ళై విడాకులు తీసుకొని చాలా కాలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి మరోసారి పెళ్లి వైపు గాలి మళ్ళినట్లు తెలుస్తోంది. ఈమె త్వరలో రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు తెలిపింది అమలాపాల్. “రెండో పెళ్లి చేసుకుంటాను.. కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాత్రం బెడ్ రూమ్ లో సింహంలా, కండలు తిరిగిన వాడై ఉండాలి” అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

అంతేకాదు అతడికి తనపై ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక తనని ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలట. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే తాను కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో ఈసారి అయినా విడాకులు తీసుకోకుండా హాయిగా బతికితే మంచిదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బెడ్ రూమ్ గురించి అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు