Ram Charan: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి… చరణ్ ఫ్యాన్స్ కి ఇది మామూలే

తమకు నచ్చిన హీరోను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. అదే సంవత్సరానికి రెండు సినిమాలతో సందడి చేస్తే ఆ కిక్కు ఇంకా వేరే లెవెల్. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలు ఏడాదికి రెండు కాదు.. కనీసం రెండేళ్లకు ఒక్కటి కూడా రావడం లేదు. భారీ సినిమాలు అంటూ దాదాపు ఒక్కో సినిమా చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు డైరెక్టర్లు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా చొప్పున తీసిన రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నాలుగేళ్ల సమయం పట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా, ఆ నాలుగేళ్ల పాటు అభిమానుల ఎదురుచూపులు మాత్రం మర్చిపోలేం. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాకా.. జక్కన్నతో మళ్లీ సినిమా వద్దు బాబాయ్ అని చరణ్ ఫ్యాన్స్ బహిరంగంగానే అన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ డ్రామా చేస్తున్నాడు. శంకర్ తో సినిమా అంటే షూటింగ్ ఫాస్ట్ గానే ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఈ గేమ్ ఛేంజర్ కూడా రెండేళ్ల టైం తీసుకుంటుంది.

RC15 అంటూ 2021 ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. రెండేళ్లు గడుస్తున్నా.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పట్లో కంప్లీట్ అవుతుందా ? అనే దానికి మూవీ యూనిట్ నుంచి కూడా సరైన సమాధానం లేదు. ఎందుకంటే, డైరెక్టర్ శంకర్ ఒకే సారి రెండు పడవలపైన ప్రయాణిస్తున్నట్టు.. ఇటు గేమ్ ఛేంజర్ షూట్ చేస్తూనే.. అటు ఇండియన్ 2 ను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ప్రారంభంలో రెండు సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చిన శంకర్.. ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం ఇండియన్ 2పైనే ఉందని తెలుస్తుంది.

- Advertisement -

దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ కి మరింత సమయం పట్టేలా ఉంది. కనీసం ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ కూడా రావడం లేదు. ముందుగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తే వచ్చే సంక్రాంతి కాదు… వచ్చే వేసవికి కూడా గేమ్ ఛేంజర్ విడుదల కష్టమే.

షూటింగ్.. రిలీజ్ డేట్ ఆలస్యమవుతున్న సమయంలో చరణ్ ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి కనీసం సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ శంకర్ పై, దిల్ రాజ్ పై మండిపడుతున్నారు. ఇటీవల దిల్ రాజు తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కామెంట్స్ లో గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్స్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ మరీ దారుణంగా ఉన్నాయి.

ఏది ఏమైనా శంకర్ తో సినిమా అంటూ ఖుషి అయిన ఫ్యాన్స్ ఇప్పుడు.. శంకర్ ను కూడా ట్రోల్ చేయడానికి వెనకాడటం లేదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు