Khushi : రష్మిక కు హ్యాండ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ-ఇద్దరి మధ్య అసలేం జరుగుతుంది

సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్టైన జోడీల్లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడి కూడా ఒకటి. పరుశరాం దర్శకత్వంలో గీత గోవిందం అనే సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించగా, ఈ సినిమా సూపర్ హిట్టై బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వసూళ్ళని రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య కెమిస్ట్రీనే అనేది అందరికి తెలిసిందే.

ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ- రష్మిక కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన, విజయ్ దేవరకొండ- రష్మిక పెయిర్ మాత్రం మళ్ళీ ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయింది.

ఇలా రెండు సినిమాల్లో కలిసి నటించటంతో ఈ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. దాంతో ఇద్దరు బయట కూడా కలవటం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇటీవలనే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ సినిమా సాంగ్ లాంచ్ కి రష్మిక అటెండ్ అవ్వగా, ఆ క్రౌడ్ అంత వదిన, వదిన అంటూ విజయ్ దేవరకొండ- రష్మికల ప్రేమకి వత్తాసు పలికారు. అయితే ఈ విషయాన్నీ ఇంకా పాపులర్ చేయొద్దు అనే ఉద్దేశ్యంతో వీళ్ళ రిలేషన్ షిప్ గురించి విజయ్- రష్మిక మీడియా ముందు మాట్లాడటం మానేశారు.

- Advertisement -

ఇక విషయానికొస్తే విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు గీత గోవిందం సినిమాతో విజయ్ కి సూపర్ హిట్ ఇచ్చిన పరుశరాం తోను ఒక సినిమా కమిట్ అయ్యాడు. గీత గోవిందం సినిమాకి ఈ సినిమా సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుండగా, ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మికని కాకుండా మృణాల్ ఠాకూర్ ని సెలెక్ట్ చేసారని వార్తలు వస్తోన్నాయి. దాంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ- రష్మికల పెయిర్ అంత హిట్టైన సీక్వెల్ మాత్రం రష్మికని కాకుండా మృణాల్ ని తీసుకోడానికి కారణం ఏమైఉంటుందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒకవేళ రష్మిక , విజయ్ దేవరకొండ మధ్య ఏమైనా చెడిందా, అందుకే విజయ్ రష్మిక తన సినిమాల్లో తీసుకోవట్లేదా.. అని సోషల్ మీడియాలో పోస్ట్ వేయడం మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రేపు రానుంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు