SSMB29 : మహేష్, రాజమౌళి సినిమా పై ఫేక్ న్యూస్ వైరల్ ! అసలు నిజమేంటంటే..

సోషల్ మీడియా వల్ల ఈ మధ్య కాలంలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. గాసిప్స్, రూమర్స్ పేరిట ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతుండటంతో అఫీషియల్ న్యూస్ కు , ఆన్-అఫీషియల్ న్యూస్ కి తేడా లేకుండా పోతుంది.ఇక అసలు విషయం ఏంటంటే గత కొద్దీ రోజులుగా మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమాపై ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకి రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది.

అయితే మహేష్ గుంటూరు కారం సినిమా తరువాత, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని మరియు హీరో క్యారెక్టర్ హనుమంతుడి పాత్రని బట్టి డిజైన్ చేస్తున్నారని రోజుకోరకంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి వచ్చిన మరో రూమర్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది

- Advertisement -

ఆ రూమర్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు9 న వస్తుండటంతో, ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఎనౌన్స్ మెంట్ మరియు సినిమా షూటింగ్ డేట్ పై క్లారిటీ రాబోతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.రైటర్ విజేంద్ర ప్రసాద్ గాని రాజమౌళి గాని దీనికి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. సినిమా స్క్రిప్ట్ ఇంకా లాక్ అవవలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవడంతో ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సినిమా గురించి ఎలాంటి వార్తని ఆయన షేర్ చేసుకోడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.

మూవీ టీం నుంచి ఎలాంటి న్యూస్ వస్తుండకపోవటంతో ఎవరో కొంత మంది రాజమౌళి, మహేష్ మూవీ యూనిట్ పై ప్రెజర్ పెట్టాలనే కారణంతో ఈ విధంగా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నరని ఫ్యాన్స్ ఎవరు ఆ వార్తలని నమ్మి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవద్దని మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు