Prabhas: మొదటి రోజు ఆదిపురుష్ చరిత్ర సృష్టిస్తుందా? లెక్కలు ఎలా ఉన్నాయంటే..

ఆది పురుష్ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్ధమవుతుంది. విడుదలకి ముందునుండే పలు విభాగాల్లో రికార్డులు సృష్టిస్తూ వస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ డే కూడా రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇండియా లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం యొక్క ఓపెనింగ్స్ లెక్కలు ట్రేడ్ వర్గాల్లో ఇలా ఉన్నాయి..

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ దక్కింది. ఏపీ, నైజాం కలిపి దాదాపు 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా పొరుగు రాష్ట్రాల్లో కూడా బాగానే బిజినెస్ చేసింది. తమిళనాడు లో 5 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లు, కేరళలో 2 కోట్లు బిజినెస్ చేయగా, హిందీ వెర్షన్ కి సంబంధించి ఇంకా అఫిషియల్ లెక్కలు రాలేదు. అయితే ఆదిపురుష్ కి ఉన్న బజ్ దృష్ట్యా హిందీలో 200 కోట్లకి పైగా బిజినెస్ జరిగి ఉండొచ్చని సమాచారం. ఒకవేళ ఇది కాకపోతే, ఆ చిత్ర నిర్మాతలే హిందీలో ఓన్ రిలీజ్ చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా అన్ని భాషలోనూ కలిపి 350 నుండి 450కోట్ల వరకు ఆదిపురుష్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై అప్పుడే ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా ఫస్ట్ డే RRR(135cr షేర్) రికార్డును బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అయితే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ పలు ఏరియాల్లో ఓపెన్ అవగా ఇప్పటివరకు 7 కోట్ల వరకు అడ్వాన్సు బుకింగ్స్ జరిగాయని అంటున్నారు. రిలీజ్ కి మూడు రోజుల ముందే ఈ రేంజ్ లో బుకింగ్స్ జరగడం విశేషమనే చెప్పాలి.

- Advertisement -

ఇక ఆదిపురుష్ సినిమాను అన్ని భాషల్లో కలిపి 8000 నుండి 10000 థియేటర్లలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి భారీ ఓపెనింగ్స్ పైనే కన్నేశారని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నాన్ RRR రికార్డు క్రియేట్ చేసి అవకాశాలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి ఉన్న హైప్ కి ప్రభాస్ ఫాలోయింగ్ కి తెలుగు రాష్ట్రాల్లో 40 నుండి 50 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది.

ఇక ఆదిపురుష్ కి తెలుగులో కంటే హిందీలో భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. పైగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ లో హిందీ వెర్షన్ కే ఎక్కువ జరిగాయి. ఆదిపురుష్ చిత్రానికి హిందీలో ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హిందీలో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు పఠాన్(55cr) , కే.జి.ఎఫ్ 2(53.2cr) చిత్రాలు నిలిచాయి. ఆదిపురుష్ కి ఉన్న హైప్ కి హిందీలో ఆఫ్ లైన్ టిక్కెట్ల లెక్కలు కూడా బాగుంటే 50 నుండి 60 కోట్ల వరకు ఓపెనింగ్స్ దక్కించుకోవచ్చు.

అయితే సౌత్ వెర్షన్ లో తెలుగు మినహా, ఇతర భాషల్లో పెద్దగా అంచనాలు లేనందున సౌత్ నుంచి ఫస్ట్ డేన 50కోట్ల వరకు రావొచ్చు. అయితే ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ కి ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఎందుకంటే పలు హాలీవుడ్ సినిమాలు కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు ఎక్కువ స్క్రీన్ లు లభించలేదు. ఓవరాల్ గా ఆదిపురుష్ చిత్రానికి ఫస్ట్ డే అన్నిచోట్లా కలిపి ఫస్ట్ డే 120 నుండి 160 కోట్ల వరకు ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చని సమాచారం. సినిమా కంటెంట్ బాగుండి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సం సృష్టిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు