Pawan kalyan : OG సినిమాతో రికార్డ్ లు బద్దలవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళ్ యాక్ట్రెస్

పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమా గురించి అందరికి తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దానయ్య డివివి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రోజురోజుకి అంచనాలను పెంచుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న బ్యాక్ తో బ్యాక్ సినిమాలన్నిటిలో OG సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాహో సినిమా తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ OG సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తుంది. తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. వీళ్లందరితో మరో పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి గాను తమిళ్ యాక్ట్రెస్ శ్రియ రెడ్డిని ఈ సినిమాలో తీసుకున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం మూడవ షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో విలన్ అర్జున్ దాస్ తో తమిళ్ యాక్ట్రెస్ శ్రియ రెడ్డి కూడా షూటింగ్ లో పాల్గొననుంది.

- Advertisement -

ఇటీవలనే ఈమెకి OG సినిమా స్క్రిప్ట్ ని పంపించగా, ఆమె దాన్ని చదివి ఎగ్జైట్ అయ్యి, ట్విట్టర్ ద్వారా ఆమె భావాలని పంచుకుంది. స్క్రిప్ట్ చదివిన కేవలం 5 నిమిషాల్లోనే తాను సినిమా చేస్తున్నా అని సుజీత్ కి చెప్పేసిందట. తన క్యారెక్టర్ ని సుజీత్ చాలా బాగా డిజైన్ చేశాడంటూ చెబుతూ, పవన్ కళ్యాణ్ లాంటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉందని, అలాగే ఆమె సినిమా గురించి మెన్షన్ చేస్తూ ఈ సినిమా అన్ని బౌండరీస్ క్రాస్ చేసి పెద్ద హిట్ అవుతుంది అంతేకాదు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే సినిమా అవబోతుందని ఆమె అభిప్రాయ పడింది.

ఇప్పటికే ఈ సినిమాలో పని చేసిన వాళ్లంతా సినిమా గురించి ఒక రేంజ్ లో మాట్లాడుతుండటంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే OG సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా అవబోతుందనిపిస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు