Adivi Sesh: ‘మేజర్’ కి ఘోర అవమానం – కారణం..?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘జీఎంబీ’ ఎంటెర్టైమెంట్స్ పై మహేష్ బాబు, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన మేజర్ సినిమా గత సంవత్సరం విడుదలై పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేంతగా టచ్ చేసింది ఈ సినిమా ఆడియెన్స్ ని. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలో కూడా మేజర్ మంచి వ్యూస్ సాధించి సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉండగా, ఇటీవలే బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమాకు డిజాస్టర్ రేంజ్ లో టీఆర్ఫీ వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత టీవీల్లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు సిటీల్లో 1.87, రురల్ ఏరియాల్లో 1.70 లాంటి డిజాస్టర్ రేటింగ్ నమోదయ్యింది.

మేజర్ సినిమాకి ఇంతటి డిజాస్టర్ రేటింగ్ రావటానికి ప్రధాన కారణం ఏడాది తర్వాత టెలికాస్ట్ అవ్వటం అయితే, ఐపీఎల్ సీజన్ నడుస్తుండటం మరో కారణం అని చెప్పాలి. ఐపీఎల్ సీజన్ పీక్స్ లో ఉన్న సమయంలో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలకు కనీసం టీఆర్పీ రేటింగ్ కనీసం 4 నుండి 5 వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మేజర్ కి డిజాస్టర్ సినిమాలతో సమానంగా రేటింగ్ రావటం గమనార్హం. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన బలగం సినిమా 12కి పైగా టీఆర్పీ రేటింగ్ సాధించి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ గ్గా నిలిచింది.

అయితే, థియేటర్లలో విడుదలైన రెండు నెలల సమయానికే టీవిలో టెలికాస్ట్ అవ్వటం వల్ల బలగం సినిమాకు అంత మంచి రేటింగ్ వచ్చిందని అంటున్నారు. రిలీజ్ కి, టీవిలో టెలికాస్ట్ అవ్వటానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం వల్లనే మేజర్ కి మినిమమ్ రేంజ్ టీఆర్పీ కూడా రాకపోవటానికి కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైతేనేం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న మేజర్ సినిమా సరైన ప్లానింగ్ లేకపోవటం బుల్లితెరపై అవమానానికి గురైందని చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటే మరో బ్లాక్ బస్టర్ సినిమాకు ఇలాంటి అవమానం జరిగే ప్రమాదం తప్పుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు