Mem Famous: ‘మేం ఫెమస్’ సూపర్ స్టార్ ట్వీట్ ని నిజం చేస్తుందా..?

చాయ్  బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మేం ఫేమస్’. దాదాపు అందరు కొత్తవాళ్లతో రూపొందిన ఈ సినిమా డిఫరెంట్ ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మే 26న విడుదల కానున్న ఈ సినిమాను ఒకరోజు ముందుగానే సూపర్ స్టార్ మహేష్ బాబుకి చూపించారు, ఈ సినిమా చుసిన మహేష్ బాబు సినిమా యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ ,మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూసి అభినందించటం పట్ల సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.

‘మేం ఫేమస్’ సినిమా ఇప్పుడే చూశాను, ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా చిత్ర దర్శకుడు, రచయిత, హీరో అయిన సుమంత్ ప్రభాస్ ని మెచ్చుకోవాలి, ఏం టాలెంట్, మ్యూజిక్, విజువల్స్, అన్ని బాగున్నాయి అంటూ ట్వీట్ చేశాడు మహేష్. ఈ సినిమాలో అందరు కొత్తవాళ్లే అంటే నమ్మలేకపోయా అని, యువతను ప్రోత్సహిస్తున్న నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలకు, చిత్ర బృందానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేసాడు మహేష్ బాబు.

అయితే, మరో పక్క మహేష్ ట్వీట్ కి వ్యతిరేకంగా ‘డిజాస్టర్ మేం ఫేమస్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఛాయ్ బిస్కెట్ టీమ్ తో సాన్నిహిత్యం వల్ల మహేష్ ,రిలీజ్ కి ముందు రోజు సినిమా చూసి ట్వీట్ చేశాడు కానీ, పొరపాటున ఈ సినిమా గనక ఆశించిన స్థాయిలో అలరించకపోతే మహేష్ బాబుపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. మరి, యంగ్ టీమ్ నుండి  వస్తున్న ఈ సినిమా మహేష్ బాబు ట్వీట్ ని నిజం చేస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు