Rebel Star: ఆదిపురుష్ ప్రమోషన్స్ స్ట్రాటజీ అదుర్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.  అప్పట్లో క్వాలిటీ లేని విజువల్స్ తో టీజర్ విడుదల చేసి తీవ్ర వైమర్శలు ఎదుర్కొన్న మూవీ టీమ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వీఎఫెక్ట్స్ విషయంలో తప్పులు సరిదిద్దుకొని ట్రైలర్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేసింది. ట్రైలర్ తర్వాత విడుదలైన జై శ్రీరామ్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ క్రమంలో ఆదిపురుష్ టీమ్ నుండి మరో అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ట్రైలర్ ను భారీ ఎత్తున రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఇప్పుడు ఆదిపురుష్ నుండి సెకండ్ సింగిల్ ని కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. మే 29న రిలీజ్ చేయనున్న ఆదిపురుష్ సెకండ్ సింగిల్ ని దేశవ్యాప్తంగా 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ న్యూస్ చానళ్ళు, యీట్యూబ్ చానళ్ళు, సోషల్ మీడియా ప్లాటుఫామ్స్, సినిమా చానళ్ళు, మూవీ థియేటర్లలో పాటను ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఒక పాటను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.

‘రామ్ సియారామ్’ అంటూ సాగే ఈ పాట హిందీ, తెలుగు, తమిళ మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో వీఎఫెక్స్ తో పాటు మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలువనుందని అంటున్నారు. ప్రభాస్ సరసన కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 16న విడుదలకి సిద్ధంగా ఉంది. టీజర్ తో ఎంత నెగిటివిటి ఎదుర్కుందో ట్రైలర్ తో అంత పాజిటివిటి సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రభాస్ కి మరో పాన్ ఇండియా హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు