8YearsForSarainodu : సరైనోడి బ్రాండ్ దెబ్బకు ఎనిమిదేళ్లు..

8YearsForSarainodu : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు ఈ పాన్ ఇండియా స్టార్ సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. అయితే అంతకంటే ముందే అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ బాలీవుడ్ వాళ్ళకి తెలిసిందని తెలుసా. ఆ సినిమాతో టాలీవుడ్ వాళ్ళకే కాదు బాలీవుడ్ వాళ్లకు కూడా టన్నులు, టన్నులు చూపించాడు. ఇక ఆ సినిమా ఏదో ఈపాటికే అర్ధమై ఉంటుంది. అదే అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘సరైనోడు’. స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో అల్లు అర్జున్ సత్తా చూపించింది. ఇక హిందీలో యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ నుండి అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 2016 ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ సినిమా నేటికీ 8ఏళ్ళు (8YearsForSarainodu) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సరైనోడి బ్రాండ్ వ్యాల్యూ గురించి ఓ లుక్కేద్దాం..

నెగిటివ్ టాక్ తో భారీ విజయం..

ఇక అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించగా, ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుండి మొదట నెగిటివ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా మూవీ క్రిటిక్స్ అయితే ఏకంగా 2/5 అంతకంటే తక్కువ రేటింగ్స్ కూడా ఇచ్చారు. కానీ ఈ మూవీ నెగిటివ్‌ టాక్‌ తో కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకోవడం విశేషం. యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక సరైనోడు సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్‌ డైరెక్షన్‌కు, అల్లు అర్జున్‌ యాక్షన్‌ తోడై ఈ సినిమా భారీ హిట్‌ సాధించింది. ఇక సరైనోడు సినిమాకు థమన్‌ అందించిన మ్యూజిక్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి, బన్నీ కాంబోలో వచ్చే ఆ బ్రాండ్ అనే డైలాగ్ సీన్ సినిమాకే హైలెట్. “ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు.. ఇక్కడ దమ్ము.. టన్నులు టన్నులు ఉంది చూస్తావా” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఫెవరేట్ .

అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..

ఇక సరైనోడు మూవీ 2016లో సెకండ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 2016లో జనతా గ్యారేజ్ తర్వాత సెకండ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఒకేరోజు విడుదల చేశారు. ఈ మూవీ 2016లో 73 కోట్ల షేర్ వసూలు చేసి 140 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 115 కేంద్రాల్లో 50 రోజులకు పైగా ఆడి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా కు సీక్వెల్ గా సరైనోడు 2 తీస్తానని అప్పట్లో బోయపాటి శ్రీను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక సరైనోడు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో 800 మిలియన్‌ వ్యూస్‌ పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గోల్డ్‌మైన్‌ కంపెనీ ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేసింది. అంతే కాదు నార్త్ వైపు పుష్ప రిలీజ్ అయిన ఊపులో ఈ సినిమాను కూడా కొన్ని థియేటర్లలో ప్రదర్శిచడం జరిగింది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఈ చిత్రం ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు