Kamal Hassan: థగ్ లైఫ్ షూటింగ్ తాజా అప్డేట్..!

Kamal Hassan.. విశ్వ నటుడు కమలహాసన్ తాజాగా నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్.. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన విషయం తెలిసింది. తాజాగా ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు సమాచారం.. కమల్ హాసన్ 234వ చిత్రం గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు . ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడు మణిరత్నం బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ను సంప్రదించిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా కథ వెంటనే ఐశ్వర్యరాయ్ కూడా నటించడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది.. అంతేకాదు కథ విన్నప్పుడే ఈ సినిమాలో భాగం అయ్యేందుకు ఐశ్వర్యరాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి..

Kamal Hassan: Thug Life Shooting Latest Update..!
Kamal Hassan: Thug Life Shooting Latest Update..!

థగ్ లైఫ్ సినిమా షూటింగ్ షురూ..

ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగు ఢిల్లీలో ప్రారంభమైనట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం షూటింగు ఢిల్లీలో ప్రారంభం అవ్వగా.. ఈ షూటింగ్లో సిలంబరసంత్రి , కమలహాసన్, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి మరియు గౌతమ్ కార్తీక్ తో సహా భారీ తారాగణంతో ఢిల్లీలో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయింది..సిలంబరసంత్రి కొత్త లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే ఈయన ఈ సినిమా కోసం ఏకంగా 8 కిలోల బరువు తగ్గారట. ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ పోరాట సన్నివేశం సెర్బియాలో చిత్రీకరించబడుతుందని సమాచారం.. ప్రత్యేకంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.. అటు విశ్వ నటుడు కమలహాసన్, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఒక కోలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు.. ముఖ్యంగా ఢిల్లీ షెడ్యూల్ చిత్ర నిర్మాణంలో భాగంగా ఎటువంటి షెడ్యూల్ పూర్తి చేయబోతున్నారు అనే విషయాలపై అభిమానులు ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.. షెడ్యూల్ పూర్తయిన వెంటనే అసలు విషయాన్నీ కూడా వెల్లడించనున్నారు చిత్ర బృందం.

థగ్ లైఫ్ స్టార్ కాస్ట్..

ఇకపోతే జనవరి 24వ తేదీని ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభమైనట్టు మేకర్స్ వీడియోతో సహా ప్రకటించారు.. ఇక దాదాపు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్ , మణిరత్నం కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.. ఇక ఇందులో కమల్ హాసన్, జయం రవి , త్రిష కృష్ణన్, దుల్కర్ సల్మాన్, అభిరామి , నాజర్ సమిష్టి తదితరులు నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్ రవి కె చంద్రన్న పనిచేస్తుండగా.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్.. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అనర్బీవ్.. అలాగే కంపోజర్ గా ఏ ఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఏది ఏమైనా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని.. ముఖ్యంగా ఎలాంటి కథాంశంతో రాబోతోంది అని కూడా చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు