Cinema Politics : ఎన్నికల బరిలో MP లు గా పోటీ చేస్తున్న సినీ సెలెబ్రిటీలు వీళ్ళే..!

Cinema Politics : దేశంలో మరికొన్ని రోజులు మెంబర్ అఫ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు లో అసెంబ్లీ ఎలెక్షన్లు జరగగా, మరికొన్ని రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే దేశం మొత్తంలో ఎంపీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగనున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడి చిత్ర పరిశ్రమ కి కూడా బాగానే అంటుకోగా, సౌత్ టు నార్త్ వరకు పలువురు సినీ సెలెబ్రిటీలు ఇండియా లో పలు ప్రధాన నగరాల్లో ఎంపీ లుగా పోటీ చేస్తున్నారు. కొందరు నటులు అంతకు ముందు నుండే రాజకీయాల్లో కొనసాగుతుండగా, మరికొందరు నటీనటులు ఈసారి ఎన్నికల బరిలో నిల్చుంటున్నారు. ఇక టాలీవుడ్ లో ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవనున్నారు. అలాగే రోజా, జయప్రద లాంటి అలనాటి హీరోయిన్లు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో (Cinema Politics) కొనసాగుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి ఎన్నికల బరిలో ఎంపీలు గా పోటీ చేస్తున్న కొంతమంది సినీ సెలెబ్రిటీల గురించి సమాచారం అందింది. వాళ్లని ఒకసారి గమనిస్తే..

1. రవికిషన్ (గోరఖ్ పూర్)

భోజ్ పూరి నటుడు, టాలీవుడ్ విలన్ అయిన రవికిషన్ ఉత్తర ప్రదేశ్ లో గోరఖ్ పూర్ నుండి ఎంపీ గా పోటీ చేస్తున్నాడు. ఇంతకు ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచాడు.

2. కంగనా రనౌత్ (మండీ)

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేస్తుంది. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్ లో ‘మండీ’ నుండి ఎంపీ గా ఎన్నికల్లో పోటీ చేస్తుందట. ఇక కంగనా రనౌత్ ముందు నుండి రాజకీయాల్లో లేకపోయినా, రాజకీయనాయకులకు టచ్ లోనే ఉంటుంది. ఇప్పటికే ప్రచారంలో జోరుగా ఉంది.

- Advertisement -

3. నవనీత్ కౌర్ (అమరావతి) మహారాష్ట్ర

ప్రముఖ నటి నవనీత్ కౌర్ పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించగా, ఏడెనిమిదేళ్ళుగా రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు బిజెపి తరపున మహారాష్ట్రలో అమరావతి నుండి ఎంపీ గా పోటీ చేస్తుంది.

4. అరుణ్ గోవిల్ (మీరట్)

బాలీవుడ్ లో రామాయణ్ ధారావాహిక ఫేమస్ అయిన అరుణ్ గోవిల్ పలు చిత్రాల్లో నటించాడు. కాగా బిజెపి తరపున ఉత్తరప్రదేశ్ లో మీరట్ నుండి పోటీచేస్తున్నాడు.

5. సురేష్ గోపి (త్రిసూర్)

ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి బిజెపి తరపున కేరళలోని త్రిసూర్ ఊరు నుండి ఎంపీ గా పోటీ చేస్తున్నాడు.

6. హేమమాలిని (మధుర)

బాలీవుడ్ లో అలనాటి స్టార్ నటి హేమమాలిని కూడా కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండగా, ఇప్పుడు బిజెపి నుండి ఉత్తరప్రదేశ్ లో మధుర నుండి ఎంపీ గా నిలబడుతున్నారు.

7. రచనా బెనర్జీ (హుగ్లీ )

టాలీవుడ్ లో పలు సినిమాల్లో అలరించిన 90స్ హీరోయిన్ రచనా బెనర్జీ ఇప్పుడు బెంగాల్ లో హుగ్లీ నుండి T MC పార్టీ నుండి ఎంపీ గా పోటీ చేస్తుంది.

8. శత్రుఘ్న సిన్హా (అసన్ సోల్ )

బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా పదేళ్ల నుండి రాజకీయాల్లో ఉండగా, తాజాగా బెంగాల్ లో అసన్ సోల్ నుండి T MC ఎంపీ గా పోటీచేయనున్నాడు.

ఇక వీరే గాక చిరుత హీరొయిన్ నేహా శర్మ కూడా ఎంపీ గా ఈ లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లోని భగల్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ ప్రస్తుతం భగల్పూర్ ఎమ్మెల్యే. ఇక సౌత్ లో అలనాటి నటీమణులు జయసుధ, జయప్రద, సుమలత వంటి వారు కూడా రాజకీయాల్లో నిలిచి గెలిచినవారే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు