Allu Arjun : అట్లీ, అనిరుధ్ సైలెన్స్ కు అర్ధమేంటి? ఊహించిందే జరుగుతోందా?

Allu Arjun : ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంకా పూర్తికాక ముందే ఆయన నెక్స్ట్ మూవీ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది? అనే డౌట్ మొదలైంది. అట్లీ, అనిరుధ్ సైలెన్స్ వెనక అర్థమేంటి? మధ్యలోకి వచ్చి త్రివిక్రమ్ ఇచ్చిన ట్విస్ట్ వెనకాల సీక్రెట్ ఏంటి? అన్న ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

అట్లీ, అనిరుధ్ సైలెన్స్ అందుకేనా?

జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ. చాలాకాలంగా వరుస డిజాస్టర్ లను చవి చూస్తూ సతమతమవుతున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు జవాన్ మూవీతో పాన్ ఇండియా హిట్ ఇచ్చి, 1000 కోట్ల కలెక్షన్స్ సాధించారు డైరెక్టర్ అట్లీ. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో అట్లీ మ్యూజిక్ సిట్టింగ్ లు కూడా చేశాడని ప్రచారం జరిగింది.

కానీ తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ కనీసం విష్ చేయలేదు. అలాగే అనిరుధ్ కూడా అదే సైలెన్స్ మెయింటైన్ చేయడం అల్లు అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ ఖచ్చితంగా విష్ చేస్తారు. కానీ అల్లు అర్జున్ విషయంలో అట్లీ అలా చేయకపోవడమే కొత్త అనుమానాలకు తెర తీస్తోంది.

- Advertisement -

ఊహించని అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్…

ఇక అట్లీ సీన్లోకి రాక ముందు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ పట్టా లెక్కబోతోందని ప్రచారం జరిగింది. కానీ గుంటూరు కారం మూవీ రిజల్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసి అట్లీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని అన్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. అట్లీని సైడ్ చేసి, త్రివిక్రమ్ మళ్ళీ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదంతా చూశాక మోస్ట్ అవైటింగ్ అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ పోయిందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ను బన్నీ… త్రివిక్రమ్ తోనే చేయబోతున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. మరి గుంటూరు కారం మూవీ నెగెటివిటీతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన గురూజీ ఇన్ని రోజుల అజ్ఞాతవాసంలో ఇంకేం వ్యూహాలు రచించారో! స్టార్ డైరెక్టర్ అట్లీనే బన్నీ పక్కకు పెట్టేలా త్రివిక్రమ్ ఏం మ్యాజిక్ చేశాడో అని ఆశ్చర్యపోతున్నారు సినీ విశ్లేషకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు