Manjummel boys Telugu : మలయాళ నిర్మాతతో వివాదం… తెలుగు రాష్ట్రాల్లో నిలిచిపోయిన షోలు

మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను పీవీఆర్ మల్టీప్లెక్స్ నిలిపివేసింది.. దీంతో పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. థియేటర్లలో జోరుగా రన్ అవుతున్న మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాన్ని తాజాగా స్క్రీనింగ్ ఆపివేయడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు వర్షన్ స్క్రీనింగ్ ఆపేసిన పీవీఆర్ మల్టీఫ్లెక్స్..

మలయాళంలో ఘన విజయాన్ని సాధించి.. రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ … తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ.. జోరుగా దూసుకుపోతున్న ఈ సినిమాను అనూహ్యాంగా పీవీఆర్ మల్టీప్లెక్స్ వారు మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ తాజా వెల్లడించింది.

- Advertisement -

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం..

పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు కూడా తెలిపారు.

తెలుగు ఫిలిం చాంబర్ కు కంప్లైంట్ చేసిన శశిధర్ రెడ్డి..

పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారశైలిని తప్పుబడుతూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి . దీనిపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. మరి ఈ అత్యవసర సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకోనుందో చూడాలి..

సూపర్ హిట్ దిశగా మంజుమ్మెల్ బాయ్స్..

రూ.15 కోట్ల బడ్జెట్ తో మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సెట్ చేసింది.. తెలుగు వెర్షన్ కంటే ముందే మలయాళం లో సూపర్ హిట్ అయింది.. కేవలం సబ్ టైటిల్స్ తోనే మూవీ చూసి హిట్ చేశారు ఆడియన్స్.. దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. ఏప్రిల్ 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మే మూడవ తేదీ నుండి మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయాన్ని త్వరలోనే హాట్స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఇలా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో పివిఆర్ మల్టీప్లెక్స్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే మలయాళ నిర్మాతతో వివాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో షో లు నిలిచిపోయాయి. మరి సాయంత్రం సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి . ఇక చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు