Ram Charan: అరుదైన గౌరవం అందుకున్న చెర్రీ..!

Ram Charan.. సాధారణంగా చాలామంది ఇండస్ట్రీలోకి హీరోలుగా వచ్చి సత్తా చాటాలని ప్రయత్నం చేస్తారు.. అయితే అందులో కొంతమంది శాశ్వతంగా హీరోలుగా నిలిచిపోతే.. మరికొంతమంది మధ్యలోనే సక్సెస్ పొందలేక ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇంకొందమంది స్వయంకృషితో చరిత్ర సృష్టిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు అని చెప్పవచ్చు.. ఆయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ గా పేరు దక్కించుకున్నారు.. ఇక ఈయన వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్.. తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఏ రోజు కూడా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకోకుండా సొంత ప్రతిభతో ఇండస్ట్రీలో పేరు దక్కించుకోవడమే కాకుండా నేడు గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు.. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు.. అంతే కాదు ఈయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం అని కూడా చెప్పవచ్చు

రామ్ చరణ్ కు డాక్టరేట్..
ఇది ఇలా ఉండగా తాజాగా ఈయనకు ఒక అరుదైన గౌరవం లభించింది.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు దక్కించుకున్న రామ్ చరణ్.. సినీ పరిశ్రమకు చేసిన సేవకు గానూ ఇప్పుడు రామ్ చరణ్ కు డాక్టరేట్ లభించనుంది..ఈనెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగనుంది.. ఈ వేడుకలు యూనివర్సిటీ ఛాన్స్లర్ , సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరుగనున్నాయి.. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.. ఇక ఈ వేడుకలోనే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డిజి సీతారాం.. రామ్ చరణ్ కు ప్రత్యేకమైన గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకలకు రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఇక రాంచరణ్ కు ఈ గౌరవం లభిస్తుండడంతో అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

రామ్ చరణ్ సినిమాలు..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా లాంచనంగా పూర్తి కాగా.. మొదటి షెడ్యూల్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.. ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయనున్నారు .మరొకవైపు సుకుమార్ అల్లు అర్జున్తో పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన మళ్ళి రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు