Rajamouli: జక్కన్న డాన్స్ రిహార్సల్.. కొరియోగ్రఫీ కూడా చేసేయ్ రాదే..!

Rajamouli.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనతో సినిమా అంటే హీరోల పని అయిపోయినట్టే.. హీరోలకు మంచి ఫిజిక్ తో పాటు ఓపిక కూడా ఉండాలి. అప్పుడే రాజమౌళితో సినిమా చేయడానికి కుదురుతుంది.. ముఖ్యంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి మినిమం రెండు సంవత్సరాల సమయం తీసుకునే రాజమౌళి.. తన సినిమాలోని ప్రతి పాత్రను కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తారు.. అందుకే ఈయన సినిమాలో నటించే ప్రతి పాత్రకి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అనడం లో సందేహం లేదు.. ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళికి సంబంధించిన డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

రాజమౌళి రిహార్సల్ వీడియో..
తాజాగా రాజమౌళి ఫ్యామిలీ ఫంక్షన్ లో తన భార్యతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.తాజాగా ఈ పెర్ఫార్మెన్స్ కోసం రాజమౌళి రిహార్సల్ చేసిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు , నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రభుదేవా సినిమాలోని అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే అనే పాటకి తన భార్య రమాతో కలిసి రాజమౌళి రిహార్సల్ చేశారు.

- Advertisement -

కొరియోగ్రఫీ కూడా చేసేయొచ్చు కదా..
ఈ వీడియో చూసిన నెటిజన్ లు జక్కన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇక మీ సినిమాకి మీరే కొరియోగ్రఫీ చేసేయొచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. నిజానికి రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా తన కుటుంబ సభ్యులే అన్ని విభాగాలలో పనిచేస్తారు.. ఇక ఇప్పుడు ఈయన డాన్స్ పర్ఫామెన్స్ చూసి కొరియోగ్రఫీ కూడా మీరే చేసేయండి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

రాజమౌళి సినిమాలు..
రాజమౌళి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు తో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే రాజమౌళి వెల్లడించనున్నారు. మొత్తానికి అయితే రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. మరొకవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నారు.

రాజమౌళి ఫ్యామిలీ..
వాస్తవానికి రాజమౌళి సినిమాకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. కుటుంబానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ విదేశాలలో తెగ సందడి చేస్తూ ఉంటారు.. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి చేసే విన్యాసాలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాన్స్ రిహార్సల్స్ వీడియోని షేర్ చేయడంతో అభిమానులు, సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతూ పలు కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి డాన్స్ రిహార్సల్స్ వీడియో మీరు కూడా చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు