BMCM Twitter Review: అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీ.. ఎలా ఉందంటే..?

BMCM Twitter Review.. అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “బడే మియాన్ చోటే మియాన్” మూవీ రంజాన్ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా నటించగా.. అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.. ఇక బడే మియాన్ చోటే మియాన్ చిత్రాన్ని చూసిన కొంతమంది నెటిజెన్స్ తమ అభిప్రాయాలను ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు.. మరి ఈ చిత్రం యొక్క టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

బడే మియాన్ చోటే మియాన్ నెటిజన్స్ స్పందన..
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయని కొంతమంది నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. టైగర్ ష్రాఫ్ ,అక్షయ్ కుమార్ యాక్షన్, యాక్టింగ్ వారిద్దరి కాంబో లో వచ్చిన ఈ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా విలన్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా మరొకసారి తన నటనతో మెప్పించారని.. అయితే సినిమా కథ మాత్రం కొత్తగా లేదు.. కొన్నిచోట్ల యాక్షన్ సీన్లు మరీ ఓవర్ అయ్యాయని అనిపించిందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు..

బడే మియాన్ చోటే మియాన్.. సినిమా కథ పాత స్టోరీ లైన్ తోనే వచ్చింది.. కొత్తగా ఏమీ అనిపించలేదు.. ముఖ్యంగా అక్షయ్, టైగర్ ష్రాఫ్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయింది.. వీరితోపాటు పృథ్వీ రాజ్ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు.. ఎమోషనల్ సన్నివేశాలు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన కథలు చాలానే చూశాం.. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సినిమా చూసేటప్పుడు కాస్త బోర్ కొడుతుంది.. ఓవరాల్ గా చిన్న చిన్నగా సినిమా టైం పాస్ అవుతుంది.. అంటూ కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇక మరికొంతమందేమో.. బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో యాక్షన్ తోపాటు కామెడీ కూడా బాగా పండిందని పోస్ట్లు చేస్తున్నారు.. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే కూడా కుదిరిందని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, భారీతనం, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ పృథ్వీరాజు పర్ఫామెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయని మరి కొంత మంది పోస్ట్ చేస్తున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే కొంతమంది ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..

బడే మియాన్ చోటే మియాన్ స్టోరీ లైన్..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియాకు నష్టం చేసేందుకు విలన్ చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు హీరోలు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ.. రూ .350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలయింది. ఇక ఇందులో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. మానుషీ చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయా ఎఫ్, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు