Weekend OTT Release Movies: ఒకే రోజు పది సినిమాలు స్ట్రీమింగ్.. ఓటీటీ హవా షురూ..!

Weekend OTT Release Movies : ఒకవైపు వీకెండ్ మరోవైపు రంజాన్ పండుగ వచ్చేసింది.. ఈ రెండు సెలవులతో పాటు పైగా వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అవడానికి సినీ ప్రేమికులు ప్లాన్ చేస్తున్నారు.. పైగా ఈ వారంలోనే “గీతాంజలి మళ్లీ వచ్చింది” అనే సినిమా మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.. అంతేకాకుండా ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్ల వైపు మొగ్గు చూపని ప్రేక్షకులు ఓటీటీ వైపు చూస్తున్నారు.. ఇక ఆడియన్స్ ను రాబట్టడం కోసం.. ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఇప్పుడు సందడి చేయడానికి ఓటిటి వేదికగా సిద్ధం అవుతున్నాయి. ఇకపోతే రేపు అనగా శుక్రవారం ఒకే రోజు ఏకంగా 10 సినిమాలు , వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి.మరి రేపు ఓటీటీ లలో సందడి చేస్తున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ ప్రైమ్ :

ఓం భీమ్ బుష్ ( తెలుగు సినిమా)- ఏప్రిల్ 12
ఎన్ డబ్ల్యూ ఎస్ ఎల్ (అమెజాన్ ఒరిజినల్ సిరీస్) – ఏప్రిల్ 12
బైరి (తమిళ్) – ఏప్రిల్ 12

నెట్ ఫ్లిక్స్:

లాల్ సలామ్ – (తమిళ డబ్బింగ్ సినిమా )-ఏప్రిల్ 12
అమర్ సింగ్ చమ్కిలా – (హిందీ సినిమా) – ఏప్రిల్ 12
గుడ్ టైమ్స్ – ( యానిమేటెడ్ సిట్ కామ్) – ఏప్రిల్ 12
లవ్ డివైడెడ్ – ( పానిష్ రొమాంటిక్ కామెడీ ) – ఏప్రిల్ 12
స్టోలెన్ – (స్వీడిష్ చిత్రం) – ఏప్రిల్ 12
ఊడీ ఉడుపెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) ( కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) – ఏప్రిల్ 12

- Advertisement -

Zee 5:

గామి ( తెలుగు సినిమా) – ఏప్రిల్ 12

డిస్నీ ప్లేస్ హాట్ స్టార్:

ప్రేమలు (తమిళం, మలయాళం, హిందీ వర్షన్ )- ఏప్రిల్ 12

ఆహా:

ప్రేమలు (తెలుగు వర్షన్)- ఏప్రిల్ 12

టెంట్ కొట్ట:

అతోముగం (తమిళ్ మూవీ) – ఏప్రిల్ 12
నందివర్మన్ (తమిళ్ మూవీ) – ఏప్రిల్ 12

జియో సినిమా :

పాన్ ఒండ్రు కందెన్ (తమిళ్ మూవీ) – ఏప్రిల్ 12.

అమెజాన్ ప్రైమ్ సిరీస్ :

ఫాలో అవుట్ (ఇంగ్లీష్)-ఏప్రిల్ 12

హాట్ స్టార్ సీరీస్:

బ్లడ్ ఫ్రీ (కొరియన్) – ఏప్రిల్ 12

సైనా ప్లే:

ఉడాన్అదిమాంగళ్యం (మలయాళం) – ఏప్రిల్ 12

నెట్ ఫ్లిక్స్ సిరీస్:

ఆంత్రా సైట్ (ఫ్రెంచ్ )- ఏప్రిల్ 12
అన్లాక్డ్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 12
వాట్ జెన్నీ ఫర్ డిడ్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 12 నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం.
ది హైజాగ్ కింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 ( స్పానిష్ ) – నెట్ ఫ్లిక్స్

ఇక ఈ సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి వీటిల్లో ఏవి ప్రేక్షక ఆదరణ పొంది భారీ రేటింగ్ సొంతం చేసుకుంటారు చూడాలి.. మొత్తానికైతే ఈ వారం థియేటర్ల సందడి తగ్గిన నేపథ్యంలో ఓటీటీ హవా షురూ అయిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు