Love Life Tips : లవ్ లో పడకూడదు అనుకుంటున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి

లవ్… ఈ పదానికి నేటితరం యూత్ అంతా బానిస అయిపోయారు. అయితే అందరూ లవ్ లో పడాలి అని అనుకుంటారా? అంటే దీనికి సమాధానం నో. చాలామంది లవ్ లో పడాలని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం లవ్ లైఫ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సమాజం దృష్ట్యా అలా ఉండాలంటే కష్టమే. మరి ప్రేమలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఆలోచించే వాళ్ల కోసమే ఈ టిప్స్.

నిజానికి ప్రేమలో పడకుండా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. లవ్ చేయడానికి సమయం ఉండకపోవచ్చు. లవ్ చేస్తే హర్ట్ అవ్వాల్సి ఉంటుందని భయం కావచ్చు. లేదా ఇతర వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడతామని అటాచ్ అవుతామని ఆలోచన కావచ్చు. ఇలాంటి కొన్ని కారణాలవల్ల ప్రేమ బంధానికి దూరంగా ఉండాలి అనుకుంటారు. అయితే మీరు గనక ప్రేమలో పడకూడదని నిర్ణయించుకుంటే అవతలి వారికి ఎక్కువగా అటాచ్ కాకుండా ఉండేలా చూసుకోవడానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీ ఉద్దేశాల గురించి మీ పార్టనర్ తో నిజాయితీగా ఉండాలి. టాక్సిక్ రిలేషన్ పట్ల ఆసక్తి లేదనే విషయాన్ని ముందుగానే కమ్యూనికేట్ చేయండి.

- Advertisement -

మీ పొటెన్షియల్ పార్ట్నర్స్ తో హద్దుల్లో ఉండండి. కేవలం సరిహద్దులు పెట్టుకోవడమే కాదు వాటికి కట్టుబడి ఉండటం ముఖ్యం. ఉదాహరణకు మీకు డేటింగ్ పై మాత్రమే ఆసక్తి ఉంటే వారానికి ఒకరి కంటే ఎక్కువ మందిని కలవకూడదని నిర్ణయించుకోండి.

ఇక మీరు ప్రేమలో ఎందుకు పడకూడదు అని అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ రీజన్స్ గనక పరిష్కరించగలిగినవి అయితే ముందుకెళ్లడం ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు గాయపడతారనే భయం ఉంటే ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉన్నట్టు అనిపించే సంబంధాల నుంచి దూరంగా ఉండండి.

ఒకవేళ మీరు పార్టనర్ బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడక పోవచ్చు. అలాంటప్పుడు కేవలం డేటింగ్ చేయడానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాన్ని అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చేయండి. ఈ టిప్స్ ఫాలో అవుతే మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా సాధారణంగానే ఉంటుంది. అయితే జీవితాంతం లవ్ లైఫ్ కు దూరంగా ఉండాలని ఎవరూ అనుకోరు. లవ్ అనేది తప్పేమీ కాదు. అయితే మీరు లవ్ చేయాలనుకున్న పలు కారణాలవల్ల దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటే ఒకసారి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ప్రేమలో పడడానికి మీరు భయపడుతున్న అంశాలను అధిగమించి, లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు