Gudachari 2: మూవీ ఓపెనింగ్ అంటూ హడావిడి… ఏఐ వాడి ప్రేక్షకులతోనే ఆటలా?

క్రేజీ హీరో అడవి శేషు తాజా చిత్రం “గూడచారి 2”. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ తాజాగా పోస్ట్ చేశారు మేకర్స్. అయితే వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఎంతవరకు నిజం? అడవి శేష్ టీం ఏఐ వాడి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేస్తున్నారా? అసలు ఈ మూవీ షూటింగ్ విషయంలో ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

2018 లో వచ్చిన గూడచారి చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ స్పైక్ థ్రిల్లర్లో అడవి శేషు అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత గూడచారి మూవీకి సీక్వెల్ గా “గూడచారి 2″ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం “గూడచారి 2” ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ముగించుకుని షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. గూడచారి చిత్రానికి డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, సీక్వెల్ గా వస్తున్న “గూడచారి 2” మూవీకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అడవి శేషు కెరీర్ లోనే ఈ మూవీ హై బడ్జెట్ మూవీగా రాబోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం “గూడచారి 2” మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటూ ఈరోజు ఒక పోస్టర్ని వదిలారు. దీంతో అందరూ ఈ మూవీ షూటింగ్ ఈరోజు నుంచే స్టార్ట్ అని అనుకున్నారు. కానీ అందరిని పిచ్చోళ్లను చేస్తూ గూడచారి 2 మేకర్స్ ఏఐ జనరేటెడ్ పిక్ ని వదిలారట. ఇది తెలిసిన నెటిజెన్లు ఇలా ఏఐ వాడి ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆటలాడుతారా అంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

కాగా “గూడచారి 2” మూవీ షూటింగ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ కాలేదని సమాచారం. నిజానికి నవంబర్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన టెస్ట్ సూట్ ను వారం రోజుల పాటు చేశారట. ప్రస్తుతం సెట్ వర్క్ మాత్రమే మొదలైందని ఫిల్మీఫైకి అందుతున్న ఎక్స్ క్లూజివ్ సమాచారం. “గూడచారి 2” మూవీ అసలు షూటింగ్ ఈనెల 20 తర్వాతే జరగబోతోంది. కానీ మేకర్స్ అప్పుడే తొందరపడి సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. దీంతో అది కాస్తా ఇలా బెడిసి కొట్టింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ మూవీ కదా ఒక్క భారతదేశంలోనే కాకుండా నాలుగు వేర్వేరు దేశాల్లో జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అడవి శేష్ తో హీరోయిన్ బనితా సంధు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు