Salaar : ‘ యానిమల్’ బాటలోనే ప్రభాస్ మూవీ… అనుమానాలు రేకెత్తిస్తున్న సెన్సార్ సర్టిఫికేట్

హైలీ యాంటిసిపేటెడ్ మూవీ “సలార్” రిలీజ్ కు టైం దగ్గర పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తికాగా, అనంతరం సెన్సార్ సభ్యులు ఇచ్చిన సర్టిఫికెట్, రేటింగ్ సినిమాపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ తో ప్రభాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయబోతున్న సలార్ మూవీపై హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. చాలా కాలం నుంచి సలార్ మూవీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక వీళ్ళ నిరీక్షణకు మరో పది రోజుల్లో తెరపడనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ మూవీ ఫైనల్ రన్ టైం రెండు గంటల 55 నిమిషాలకు లాక్ చేశారట. ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్రెండ్ చూస్తుంటే ఇది చాలా ఎక్కువ సమయం. కానీ సరైన కంటెంట్ ఉంటే సినిమా మూడు గంటలకు పైగా ఉన్నా కూడా హిట్ అవ్వడం ఖాయమని రీసెంట్ గా వచ్చిన యానిమల్ మూవీ విషయంలో ప్రూవ్ అయింది. ఇదిలా ఉంటే సినిమాకు సెన్సార్ సభ్యులు ‘ ఏ ‘ సర్టిఫికెట్ ను జారీ చేశారట. రన్ టైం ఓకే గాని ‘ఏ ‘ సర్టిఫికెట్ విషయంలోనే కొత్త అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో ఏ సర్టిఫికెట్ ఇచ్చేటంత వైలెన్స్ ఉందా? అసలు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై వీక్షించవచ్చా? లేదంటే తండ్రి కొడుకుల సినిమా అనుకుని వెళ్తే యానిమల్ ఇచ్చిన షాక్ ను ఈ మూవీ కూడా గుర్తు చేస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.

- Advertisement -

నిజానికి చాలామంది డార్లింగ్ ఫాన్స్ సైతం ప్రభాస్ నుంచి రణబీర్ కపూర్ లెవెల్ లో రొమాన్స్ ను అయితే ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి సలార్ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడానికి మెయిన్ రీజన్ అందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సలార్ మూవీ నుంచి రిలీజ్ కాబోతున్న సెకండ్ ట్రైలర్ గురించి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ ఈనెల 16 నుంచి 18 తేదీల మధ్య రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ విషయంలో సలార్ టీం అసలు ఏం ప్లాన్ చేస్తుంది అన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. అలాగని మేకర్స్ కనీసం వైరల్ అవుతున్న రూమర్స్ పై కూడా స్పందించడం లేదు. ప్రస్తుతం డార్లింగ్ ఫాన్స్ సలార్ మూవీ విషయంలో, అలాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రమోషన్స్ విషయంలోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు