Rajamouli: ఆమె ప్రేమలో రాజమౌళి.. అందుకే ఆ స్టార్ హీరోయిన్ తో పెళ్లి క్యాన్సిల్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. అసలు ఫ్లాప్ అంటూ ఎరుగని డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని నేడు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఈయనకే సొంతం. మొదట శాంతినివాసం అనే ఒక చిన్న సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి.. నేడు తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం గర్వపడేలా చేసి తిరుగులేని నెంబర్ వన్ సూపర్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం రాజమౌళిని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బ్రాండ్ ఏ హీరోకి లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హాలీవుడ్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మరి ఈ సినిమాతో హాలీవుడ్ బాక్సాఫీస్ ని కూడా కొల్లగొడతాడు అనడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా రాజమౌళి వ్యక్తిగత విషయానికి వస్తే.. మొదట సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలోనే రమా తో పెళ్లైన విషయం అందరికీ తెలిసిందే. అయితే రమా కి అంతకుముందే ఒక పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయి. ఆమెకి కార్తికేయ అనే కుమారుడు మొదటి భర్తతో జన్మించాడు.

ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. ఆ సమయంలోనే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అయితే ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తండ్రి , రచయిత విజయేంద్ర ప్రసాద్ అలాగే ఆయన అన్నయ్య కీరవాణి అందరికీ తెలుసు.. ఇక రాజమౌళికి అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఊపు ఊపుతున్న యంగ్ స్టార్ హీరోయిన్ తో పెళ్లి చేయాలని విజయేంద్ర ప్రసాద్ చాలా కోరుకున్నారట. అంతేకాదు కీరవాణి ద్వారా ఆ హీరోయిన్ తో చర్చలు కూడా జరిపారు. ఇక ఆ హీరోయిన్ ని అడిగే ముందు రాజమౌళి కి ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామని.. ఆయనను అడగగా.. అప్పటికే తన మనసులో రమా ఉందని .. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడట.

- Advertisement -

ఇకలా ఆ స్టార్ హీరోయిన్ తో రాజమౌళి పెళ్లి కాస్త క్యాన్సిల్ అయింది. ఇక రమాతో పెళ్లి జరిగిన తర్వాత కార్తికేయతో రాజమౌళికి అద్భుతమైన బాండింగ్ ఏర్పడడం వల్లే ఇక ఆమెతో మళ్లీ పిల్లలు కనడానికి ఇష్టపడలేదు రాజమౌళి. అందుకే ఆయన ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు