Hari Hara Veera Mallu: ప్లాప్ డైరెక్టర్ చేతిలోకి పవర్ స్టార్ మూవీ… క్రిష్ అవుట్ ?

పీరియాడిక్ సినిమాలకు ప్రేక్షక ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఈ జానర్ లో వచ్చే సినిమాలు మినిమం గ్యారంటీ. అంతే కాదు… హీరోల మైలేజీని కూడా పెంచుతాయి ఈ సినిమాలు. అయితే పీరియాడిక్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూడాలని ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ అయి 27 ఏళ్లు అవుతున్నా.. అ కోరిక తీరడం లేదు.

అప్పుడెప్పుడో… హరి హర వీరమల్లు అంటూ క్రిష్ జాగర్లమూడి ఓ సినిమా ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 50 శాతం కంటే ఎక్కువ షూటింగ్‌ను పూర్తి చేశాడు. కానీ, ఇతర సినిమాలకు సైన్ చేయడం, రాజకీయ ప్రాధాన్యత పెరగడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత పవన్ అనౌన్స్ చేసిన సినిమాలు షూటింగ్ జరగడం, రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోయింది. కానీ హరి హరకు మోక్షం కలగలేదు.

దీంతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి… పవన్ ను వదిలేసి, ఇతర హీరోల కోసం ట్రై చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఇక నిర్మాత ఏఎమ్ రత్నం కూడా బయట మీడియాకు కనిపించినా, హరి హర గురించి మాటే తీయ్యడం లేదు. ఇలాంటి పరిస్థితులు కనిపించడంతో పవన్ ను పీరియాడిక్ మూవీలో చూడాలి అనే కోరిక తీరడం ఇక కష్టమే అని అనుకున్నారు ఫ్యాన్స్.

- Advertisement -

కానీ, హరి హర గురించి ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అదేంటంటే… మరి కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మళ్లీ స్టార్ట్ కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందు కోసం ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ రంగంలోకి దిగాడట. ఇప్పటి వరకు సినిమాకు ఎంత ఖర్చు అయింది? ఇంకెంత చేయాలి? అనే దానిపై ఆయన ఫోకస్ చేస్తున్నారట. అంతే కాదు… బ్యాలెన్స్ షూటింగ్, నటీనటుల డేట్స్ అన్ని కూడా ఆయన దగ్గరుండి చూస్తున్నారని టాక్.

కాగా, జ్యోతికృష్ణ నిజానికి ఓ డైరెక్టర్. తెలుగులో నీ మనసు నాకు తెలుసు తెలుగు, ఆక్సిజన్, రూల్స్ రంజన్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక తెలుగులో మరో 3 సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు రత్నం గారి అబ్బాయి.. హరి హరను గట్టేకిస్తాడో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు