Parenting Tips : పిల్లలతో ఈ 5 పవర్ ఫుల్ లైన్స్ చెప్పారంటే కాన్ఫిడెన్స్ లో వాళ్లే కింగ్

Parenting Tips : కాన్ఫిడెన్స్ అనేది పిల్లల జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తమ సామర్థ్యాన్ని నమ్మడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి, లక్ష్యాలను సాధించడానికి ఆత్మవిశ్వాసం సహాయపడుతుంది. పెద్దయ్యాక వాళ్ళు అనుకున్నది సాధించాలంటే చిన్నప్పుడే కాన్ఫిడెన్స్ అనేది వాళ్లలో నాటుకుపోయేలా చేయాల్సిన బాధ్యత పూర్తిగా పేరెంట్స్ దే. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్రను పోషించాల్సి ఉంటుంది. అందుకే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలను ప్రోత్సహించాలి, అభినందించాలి, అన్ని విషయాల్లోనూ తోడుగా ఉండి సపోర్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళలో కాన్ఫిడెన్స్ నిండు కుండలా తొణికిసలాడుతుంది. ఇవన్నీ చేయడానికంటే ముందు కొన్ని పవర్ ఫుల్ పదాలను మీ పిల్లలతో చెప్పారంటే ఆటోమేటిక్ గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి పిల్లలలో కాన్ఫిడెన్స్ పెంచే ఆ పదాలు ఏంటి? అంటే…

1. మేము నిన్ను నమ్ముతున్నాము

ఈ పదాలు తల్లిదండ్రుల నోటి నుంచి వస్తే పిల్లలపై ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. తమ సామర్థ్యాలను తల్లిదండ్రులు నమ్ముతున్నారని భావిస్తారు పిల్లలు. దీంతో వాళ్ళు ఎలాంటి బెదురు భయం లేకుండా తమపై తాము మరింత నమ్మకంతో చేయాలనుకున్న పనిని కాన్ఫిడెన్స్ తో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు.

2. నువ్వు చాలా మంచి వాడివి

వినడానికి ఇది ఒక సాధారణ కామెంట్ లాగే అనిపించవచ్చు. కానీ పేరెంట్స్ చెప్పే ఈ మాట పిల్లలకు తాము మంచి పని చేస్తున్నామని భావించడానికి హెల్ప్ అవుతుంది. మీ పిల్లలతో ఇలా చెప్పారంటే వాళ్లలో పాజిటివ్ మైండ్ సెట్ బాగా పెరుగుతుంది. వాళ్లపై వాళ్లకు నమ్మకం, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి.

- Advertisement -

3. తప్పులు చేయడానికి భయపడొద్దు

తప్పులు చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటామన్న విషయం తెలిసిందే. అయితే పిల్లలతో ఇలా తప్పులు చేయడానికి భయపడొద్దు అని చెప్పాలి. అలాగని అన్నీ తప్పులు చేస్తూ ఉండమని కాదు. ఆ తప్పులు నేర్చుకోవడంలో ఒక భాగమని, ఒకసారి తప్పు జరిగినా పర్లేదు కానీ మళ్ళీ అదే రిపీట్ కాకుండా చూసుకోవాలని వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. అలాగే పిల్లలు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి వాళ్లు కొత్త విషయాలను నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

4. నువ్వు దీన్ని చేయగలవు

చాలామంది చిన్న పిల్లలు కాన్ఫిడెన్స్ లేక తామసలు ఏదైనా పనిని చేయగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడే తల్లిదండ్రులు ముందుండి నువ్వు దీన్ని చేయగలవు అని స్ట్రాంగ్ గా చెప్పారంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీంతో ఫలితంతో సంబంధం లేకుండా వాళ్లు చేయాలనుకున్న పనిని చేసేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా తిట్టడం వంటి తప్పులను తల్లిదండ్రులు చేయొద్దు.

5. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు

పిల్లలతో ఈ వాక్యం చెప్పారంటే వాళ్ళు తల్లిదండ్రుల వద్ద సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. అలాగే పిల్లలకు మీతో ఏదైనా చెప్పొచ్చు అనే ఫ్రీ ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా పిల్లలకు తమ తల్లిదండ్రులు తమకు అండగా ఉన్నారని, తమ మాట వింటారని కాన్ఫిడెన్స్ కలుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు