Akshay Kumar: ఒకప్పుడు వీధుల్లో నగల వ్యాపారి.. ఇప్పుడు స్థాయి చూస్తే షాక్..!

Akshay Kumar.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే నటీనటులకు సక్సెస్ అనేది అంత త్వరగా.. సులభంగా రాదు. ఏళ్ల తరబడి కష్టపడ్డా..కొంతమంది వ్యక్తులు మాత్రమే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటారు. అలా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారిలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఒకరు.. నేడు ఈ స్థాయికి ఎదిగిన ఆయన సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు ఏం చేసేవారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు..

Akshay Kumar:Once upon a time jeweler seller on the streets..but Shocking to see the level now..!
Akshay Kumar:Once upon a time jeweler seller on the streets..but Shocking to see the level now..!

వీధుల్లో నగలు అమ్మి..
ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఒకప్పుడు వీధుల్లో నగలు అన్ని డబ్బు సంపాదించేవారు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోలలో ఒకరిగా నిలిచారు బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్.. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న అక్షయ్ కుమార్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. వివిధ నగరాలలో కూలీగా పనిచేశారట.. పొట్టకూటి కోసం వీధుల్లో గిల్టు నగలు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించారట. ఇప్పుడు ఒక్కో సినిమాకు సుమారుగా రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

అక్షయ్ కుమార్ కష్టాలు..
ప్రస్తుతం అక్షయ్ కుమార్ రూ.90 కోట్ల విలువైన విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్నారు. ఇక ఆయన కారు గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదువే లేదు అప్పట్లో 150 రూపాయల జీతంతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. 15 సంవత్సరాల వయసు నుంచే పని చేయడం ప్రారంభించినట్లు తెలిపిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. కలకత్తాలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో హెల్పింగ్ బాయ్ గా పని చేశాను.. నా మొదటి జీతం రూ.150.. బ్రతుకు తెరువు కోసం ఎన్నో పనులు చేశాను.. ఢిల్లీ వీధిలో గిల్టు నగలు అమ్మాను.. ఆ తర్వాత ఢాకా కు వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేశాను. ఆ తర్వాత బ్యాంకాక్ కి వెళ్లాను.. ఢిల్లీలో కొన్న నగలు ముంబైలో అమ్మేవాడిని.. గిల్టు నగలను ఢిల్లీలో రూ.20 వేలకు కొనుగోలు చేసి.. వాటిని ముంబైలో రూ.24 వేలకు అమ్మాను అంటూ తెలిపారు..

- Advertisement -

అక్షయ్ కుమార్ ఆస్తులు..
అక్షయ్ కుమార్ సినిమాలోకి రాకముందు అద్దె ఇంట్లో ఉండేవారట.. సినిమాల్లోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు.. ఆ తర్వాత అవకాశాలతో సక్సెస్ అందుకొని నేడు బాలీవుడ్ స్టార్ హీరోగా చలామణి అవ్వడమే కాదు దేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు..ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 నుంచి రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈయన నికర సంపాదన రూ.2,500 కోట్లు.. అక్షయ్ కో యాక్ట్రెస్ అయిన ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే రూ.260 కోట్ల విలువైన స్పెషల్ జెట్ వీరి సొంతం.. రూ .10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవెన్, రూ.4కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జిటి వంటి లగ్జరీ కార్లు ఈయన సొంతం.. తాజాగా ఈయన నటించిన ” బడే మియాన్ చోటే మియాన్” సినిమా ప్రేక్షకుల ముంకు వచ్చి మిశ్రమ స్పందన పొందుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు