Pushpa The Rule Release : పుష్ప రాజ్ దెబ్బకు సింగం పరార్…?

Pushpa The Rule Release : సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అల్లు అర్జున్ బర్త్ డేకు వచ్చిన గ్లింప్స్‌ను చూశారా..? అది గుర్తుందా…? ఆ గ్లింప్స్‌ చివర్లో… అడవుల్లో అల్లు అర్జున్ వస్తుంటే… అక్కడ ఉన్న పులి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు వచ్చిన గ్లింప్స్ ఈ టైంలో సరిగ్గా సెట్ అయ్యేలా ఉంది. అయితే చిన్న ఛేంజ్… ఇప్పుడు వెనకడుగు వేసేది పులి కాదు సింగం. గ్లింప్స్‌లో పులి ఏంటి… ? ఇప్పుడు సింగం ఏంటి…? ఈ వెనకడుగు వేయ్యడం ఏంటి..? అని అనుకుంటున్నారా….

2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజ్ చేస్తే, అక్కడ నుంచి వచ్చిన కలెక్షన్లు అంతా ఇంత కాదు. హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన కలెక్షన్ల వల్లే పుష్ప మూవీ క్రేజ్ వరల్డ్ వైడ్ కి వెళ్లింది అని చెప్పొచ్చు.

పుష్ప వల్ల నష్ట పోయిన బాలీవుడ్ సినిమాలు…

పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోలవి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన 83, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన అత్రంగి రే లాంటి సినిమాలు పుష్ప ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రణ్‌వీర్ సింగ్ 83 మూవీ అయితే దాదాపు 250 కోట్ల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ, బాక్సాఫీస్ వద్ద కనీసం 200 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇక అత్రంగి రే అయితే క్రిటిక్స్ నుంచి మిక్సిడ్ రివ్యూస్ తెచ్చుకుంది. అది కలెక్షన్లపై ప్రభావం చూపించింది. అదే టైంలో పుష్ప మూవీ నార్త్ స్టేట్స్‌లో బీభత్సం సృష్టించింది.

- Advertisement -

Read More : Pushpa 2 Update : ఆ ఒక్క సీన్ కోసమే బన్నీ 51 టేక్స్ తీసుకున్నాడా?

ఇప్పుడు సింగం బ్యాక్ స్టెప్…

2021లో బీ టౌన్‌లో పుష్ప రాజ్ చేసిన సంచలనం ఇప్పట్లో మర్చిపోలేరు.
అందుకే ఓ సినిమా తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాలని అనుకుంటుదట. అది ఏంటో కాదు… సింగం ఎగైన్ ( సింగం 3 ). అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న మూవీ ఇది. సింగం సిరీస్‌లో మూడో సినిమా ఇది. బాలీవుడ్ లో కాప్ సినిమాటిక్ యూనిర్స్‌లో భాగంగా వస్తున్న సినిమా ఇది.

  • ఇప్పటి వరకు ఈ కాప్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన సింగం (2011) 40 కోట్ల బడ్జెట్‌తో వస్తే 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
  • దీని తర్వాత సింగం రిటర్న్స్ ( 2014 ) … అదే 70 కోట్ల బడ్జెట్ తో వస్తే 250 కోట్ల వరకు వసూళ్లు చేసింది.
  • అలాగే ఇదే యూనివర్స్‌లో వచ్చిన సింబ ( 2018 ) మూవీ 70 కోట్ల బడ్జెట్‌తో వస్తే ఏకంగా 400 కోట్లను కలెక్ట్ చేసింది.
  • సూర్యవంశీ ( 2021 ) 150 కోట్లతో తెరకెక్కితే దాదాపు 300 కోట్ల వరకు వసూళ్లు అయ్యాయి.

Read More : Singham Again: దీపు ఓవరాక్టింగ్ ఎక్కువైందట.. బాలీవుడ్ నెటిజన్స్ ట్రోలింగ్?

బ్యాక్ స్టెప్ వేయ్యకపోతే నష్టపోవాల్సిందే…

ఇప్పుడు సింగం ఎగైన్ (2024) అంటూ అజయ్ దేవగన్ మరోసారి వస్తున్నాడు.
ఇది కూడా కాప్ సినిమాటిక్ యూనివర్స్ లో నుంచి వస్తుందే. అయితే 2021లో పుష్ప సినిమా వల్ల బాలీవుడ్ సినిమాలపై ప్రభావం కనిపించింది. ఎంతో సక్సెస్ ఫుల్ అని చెప్పుకుంటున్న ఈ కాప్ సినిమాటిక్ యూనివర్స్ లో నుంచి వచ్చిన సూర్య వంశీ కూడా 2021లో పుష్ప బాధిత సినిమా అనే చెప్పొచ్చు.

మరి ఇప్పుడు 2024లో పుష్ప రాజ్ మళ్లీ ఆగస్టు 15న థియేటర్ లోకి రాబోతున్నాడు. పుష్ప పార్ట్ 1 పై ఉన్న క్రేజ్ వల్ల పుష్ప 2పై భారీగా హైప్ పెరుగుతుంది. అదే టైంలో అంటే… ఈ ఆగస్టు 15నునే సింగం ఎగైన్ థియేటర్ లోకి రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అంటే… పుష్ప vs సింగం వార్ బాక్సాఫీస్ దగ్గర ఉంటుంది. ఇది ఎవరికి నష్టం అంటే సింగంకే అని ఎవరిని అడిగినా తెలిసిపోతుంది.

అందుకే పుష్ప రాజ్ దెబ్బకు సింగం వెనకడుగు వేయ్యక తప్పదు. ఒక వేళ వెనకడుగు వేయకపోతే, భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇది సింగం మేకర్స్ కూడా తెలిసిపోయినట్టు ఉంది. అందుకే సింగం బ్యాక్ స్టేప్ వేయ్యడానికి సరైన డేట్ ను చూస్తున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు