Singham Again: దీపు ఓవరాక్టింగ్ ఎక్కువైందట.. బాలీవుడ్ నెటిజన్స్ ట్రోలింగ్?

పొడుగు కాళ్ళ సుందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉండే రోల్స్ చేసే హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. దీపికా నటించిన పద్మావత్, రామ్ లీల లాంటి చిత్రాల్లో తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక లేటెస్ట్ గా జవాన్ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తూ సీనియర్ హీరోయిన్లలో బిజీ యాక్ట్రెస్ గా కొనసాగుతుంది.

ఇక దీపికా పదుకొనె తాజాగా మరో మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ సింగం సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ తీయనున్నాడు రోహిత్ శెట్టి. ఈ సిరీస్ లోనూ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా, సింగం అగైన్ పేరుతొ ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న దీపికా పదుకునే ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. సింగం సిరీస్ లో దీపికా “శక్తి శెట్టి” అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో అదిరిపోయింది. గన్ పట్టుకుని విలన్ల పై కూర్చున్న ఆ స్టిల్ ఆకట్టుకుంటున్నా, ఓ రకంగా ట్రోల్ అవుతున్నాయి. దీపికా పర్సనాలిటీ కి ఆ లుక్స్ గెటప్ మ్యాచ్ కాలేదని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా దీపికా ఆ స్టిల్ లో నవ్వుతూ కొద్దిగా ఓవర్ చేస్తుందనే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి ట్రోలింగ్ దీపికా కు కొత్త కాదు. గతంలో చెన్నై ఎక్స్ప్రెస్ నుండి మొన్న పఠాన్ వరకు సినిమా రిలీజ్ ముందు ట్రోల్ చేసినా, సినిమా హిట్ అయ్యాక సైలెంట్ అయిపోతారు.

- Advertisement -

ఇక సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న సింగం అగైన్ 2024 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు