Tollywood: ‘అన్వేషి’లో అలాంటి పాత్ర చేసిన అనన్య!

 

టాలీవుడ్ టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిల్లో అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటుంది. వకీల్ సాబ్, శాకుంతలం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించిన ఈ భామ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు వస్తే ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధం అని అంటూ ఉంటుంది.

ఇక తాజాగా అనన్య నాగళ్ళ ఓ చిత్రంలో అలాంటి పాత్రే చేసింది అనిపిస్తుంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం “అన్వేషి“. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా కథ మొత్తం అనన్య చుట్టూనే తిరుగుతుందని మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాలో అనన్య నాగళ్ళ ఒక డాక్టర్ గా నటించగా, ఆ డాక్టర్ సినిమాలో చనిపోయి ఆత్మగా మారుతుందట. ఇంతకీ అనన్య అలా దెయ్యంగా మారడానికి గల పరిస్థితులేంటి?

- Advertisement -

సినిమాలో అసలు నిజంగానే దెయ్యం ఈ సినిమాలో ఉందా? లేక ఎవరైనా కట్టుకథ అల్లారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయగా, ఆ ఈవెంట్ లో అనన్య మాట్లాడుతూ తన ఫస్ట్ మూవీ మల్లేశం సినిమా ఆడియో లాంచ్ అయిన ప్లేస్ లో మళ్ళీ అన్వేషి ఈవెంట్ జరుగుతుంది. అందుకే ఆ సినిమా ఎంత పేరు తెచ్చిందో, అన్వేషి సినిమా రెట్టింపు పేరు తెస్తుందని అనుకుంటున్నానంది.

అయితే అన్వేషి సినిమా వల్ల అనన్య కి గుర్తింపు వస్తుందో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇక అనన్య మరో రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు