Hollywood: ప్రియాంక చోప్రా అత్తింట్లో గొడవలు… ఏకంగా విడాకులే!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్రమోషన్ పొందిన ప్రియాంక చోప్రా… అక్కడే హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అంతే కాదు, హాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చేసుకుని ఎంతో మంది రోల్ మోడల్ గా మారిపోయింది. భర్త నిక్ జోనాస్ తో ప్రియాంక చోప్రా బంధం కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. వీరికి మల్టీ మారీ చోప్రా జోనాస్ అనే కూతురు కూడా ఉంది. అంతా సాఫీగా సాగుతున్న ప్రియాంక చోప్రా వైవాహిక జీవితంలో కొత్తగా గొడవలు వస్తున్నాయట.

నిక్ జోనాస్ బ్రదర్ జో జోనాస్ – గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేం సోఫి టర్నర్ భార్య భర్తలు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీళ్లు డైవర్స్ తీసుకుంటున్నారు. జో జోనాస్ – సోఫి డైవర్స్ తీసుకుంటే ప్రియాంక చోప్రాకు ఏంటి సమస్య అనుకంటున్నారా?

జో జోనాస్ – సోఫి డైవర్స్ తీసుకోవడానికి కారణం ప్రియాంక చోప్రానట. సోఫి హాలవుడ్ కల్చర్ తో ఉంటుంది. పార్టీలు పబ్ లతో ఎప్పుడు తమ అత్తింట్లో సరిగ్గా ఉండేది కాదట. కానీ, భారతీయ సంతతి నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా మాత్రం వీటికి దూరంగా ఉండటమే కాకుండా, అత్తింట్లో అదరితో కలిసిపోతూ ఉంటుందట. పైగా ఈ మధ్య కాలంలో హాలీవుడ్ లో హీరోయిన్ గా సోఫి కి కంటే ప్రియాంక కే ఎక్కువ గుర్తింపు వస్తుంది. దీంతో జోనాస్ ఫ్యామిలీ ప్రియాంకను చూసి నేర్చుకో.. అంటూ సోఫికి సలహాలు ఇస్తున్నారట.

- Advertisement -

ప్రతి దానిలో ప్రియాంకతో పోల్చడం సోఫికి నచ్చక పోవడంతో జో జోనాస్ కి విడాకలు ఇవ్వడాని రెడీ అయిపోయిందట. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్‌లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోఫి టర్నర్ – జో జోనాస్ డైవర్స్ న్యూస్ పై ప్రియాంక సైలెంట్ గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు