Pushpa 2 Update : ఆ ఒక్క సీన్ కోసమే బన్నీ 51 టేక్స్ తీసుకున్నాడా?

Pushpa 2 Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 గురించి అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. దీనికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేకుండా పోయాయి. ఈ టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టుకుని మాతంగి వేషంలో చేసిన ఫైట్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ అభిమానులకు ఫుల్ ఎనర్జీని ఇచ్చిన ఈ జాతర వీడియోలో డైలాగ్స్ లేకపోయినా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అల్లు అర్జున్ గెటప్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ సీన్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాతర సీన్ కోసం 51 టేకులు

అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన పుష్ప 2 స్పెషల్ టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ప్రతి ఏటా తిరుపతిలో ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో సాగిన ఈ టీజర్ కు అల్లు అర్జున్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అయితే ఆ సన్నివేశం కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నారనే విషయాన్ని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వెల్లడించారు. ఆ జాతర సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి బన్నీ ఎంత కష్ట పడ్డాడో రసూల్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తమ హీరో డెడికేషన్ కు హాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సీన్ బిగ్ స్క్రీన్ పై చూస్తే గూస్ బంప్స్ అంటూ పుష్ప 2 రిలీజ్ గురించి ఇప్పటి నుంచే మరింత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

బన్నీ బర్త్ డే టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్…

పుష్ప 2 జాతర సీక్వెన్స్ కు సంబంధించిన టీజర్ పై మిక్స్డ్ టాక్ నడుస్తోంది. దీనిని టీజర్ అనడం కన్నా గ్లిమ్స్ అని ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పుష్ప 2 మూవీని తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు సోషల్ మీడియా వేదికగా వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలుపెట్టారు. రోజుకో పోస్టర్ తో ఏప్రిల్ 8న టీజర్ రాబోతోంది అంటూ ఊరించారు. దీంతో సినీ ప్రియుల్లో పుష్ప 2 టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి. కచ్చితంగా టీజర్ ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఈగర్ గా వెయిట్ చేశారు.

- Advertisement -

కానీ తీరా చూస్తే ఏప్రిల్ 8న 11 గంటలకు పుష్ప 2 టీజర్ అంటూ కేవలం జాతరలో బన్నీ లుక్ ను రివీల్ చేశారు. అందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను పెట్టారు. దీంతో ఈ టీజర్ అంచనాలను అందుకోలేదని, తాము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఆడియన్స్. అంచనాలను అందుకోలేకపోయిన పుష్ప 2 టీజర్ కొన్ని రికార్డులను బ్రేక్ చేయడంలో కూడా వెనకబడిపోయింది. టీజర్ పేరుతో ఉస్సూరుమన్పించిన పుష్ప 2 మేకర్స్ మరి సినిమాతోనైనా మెప్పిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ టీజర్ ను చూశాక. మరి లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప విషయంలో ఎలాంటి లెక్కలు వేస్తున్నాడో తెరపై చూస్తేనే గాని అర్థం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు