Anchor Rashmi: నాకు కాబోయే వ్యక్తి అతడే.. !

Anchor Rashmi.. బుల్లితెర ఇండస్ట్రీపై గ్లామర్ యాంకర్స్ గా చలామణి అవుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న అతి కొద్ది మంది యాంకర్స్ లో అనసూయ తర్వాత రష్మీ ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోల ద్వారా యాంకర్ గా తనకంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె అక్కడ తన అందచందాలతో యువతను మరింత ఆకట్టుకుంటోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ అభిమానులకు చేరువయ్యే ఈ ముద్దుగుమ్మ సమాజంలో మూగజీవులకు ఎదురయ్యే సమస్యలపై కూడా స్పందిస్తూ.. అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదే ఆమె పెళ్లి విషయం..

అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న రష్మీ..
రష్మీ పెళ్లి అనగానే ముందుగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ గుర్తుకు వస్తారు.. వీరిద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే ఇద్దరు లవర్స్ అన్న రేంజ్ లో తెరపై ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ.. నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారేమో అనే భ్రమ కలిగిస్తుంది.. అంతలా వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. దీంతో అభిమానులు , సెలబ్రిటీలు కూడా వీరిద్దరు వివాహం చేసుకుంటారేమో అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరచగా.. వీరిద్దరూ తాము స్నేహితులమని.. షో టీఆర్పీ రేటింగ్ కోసమే అలా చేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక షోలో పాల్గొన్న ఈమె తనకు కాబోయే భర్త గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. రష్మీ మాట్లాడుతూ.. నాకు కాబోయే వాడు నేను చెప్పిందే వినాలి.. చేసిందే నాకు చెప్పాలి అని చెప్పుకొచ్చింది రష్మీ.. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

సుధీర్ పరిస్థితి అంతేనా..
తనకు కాబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పి అలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ ..ఇక ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో మరి సుధీర్ అన్న పరిస్థితి ఏంటి? అన్న ఎక్కడికి వెళ్ళారో నీకు చెప్తున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.. మరి ఈ కామెంట్స్ పై రష్మి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -

రష్మీ కెరియర్..
రష్మీ ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా గతంలో వెండితెరపై కూడా మెరిసింది. పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది అయితే అక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బుల్లితెరకు మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ షో తో ప్రేక్షకులను అలరించిన ఈమె.. పెద్దగా తన నటనతో ఆకట్టుకోలేకపోయింది.. అందుకే ఈమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు.. దీంతో సినిమా ఇండస్ట్రీ ని వదిలి బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది.. ఇక ఇక్కడే పలు షోలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంది. మరోవైపు నిత్యం గ్లామర్ ఫోటోలతో నేటిజెన్లను కూడా అలరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా రష్మి కాబోయే భర్త గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు