Love Mouli Trailer : నగ్నంగా నవదీప్… ఈ అరాచకం కోసమేనా ఇన్నేళ్ళ అజ్ఞాతవాసం

Love Mouli Trailer : చాలాకాలం తర్వాత యంగ్ హీరో నవదీప్ లవ్ మౌళి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా లవ్ మౌళి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇందులో నవదీప్ నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చాడు. అలాగే దాదాపు ముగ్గురు హీరోయిన్లతో ఈ హీరో వేసిన వేషాలు చూశాక ఈ అరాచకం కోసమే నవదీప్ ఇన్నాళ్లు అజ్ఞాతవాసం చేశాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్నేళ్ళ అజ్ఞాతవాసం ఈ న్యూడ్ సీన్స్ కోసమేనా?

నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ మౌళి. ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పంఖురి గిద్వాని, భావన సాగి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా లవ్ మౌళి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు చూశాక నోరు వెళ్ళబెడుతున్నారు సినీ ప్రియులు. నవదీప్ తో పాటు హీరోయిన్ కూడా ఏకంగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చారు.

దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న లవ్ మౌళి ట్రైలర్ లో ప్రేమ కోసం హీరో పడే తపన, పెయింటింగ్ రూపంలో తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పడానికి ఆయన ప్రయత్నించడాన్ని చూపించారు. హీరో వేసే పెయింటింగ్ లోని అమ్మాయి ప్రాణం పోసుకోవడం, తనతో హ్యాపీగా ఉండి కొన్నాళ్ల తర్వాత గొడవలు మొదలవడం వంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను చూపించారు..దాదాపుగా సినిమా మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించారు. ముఖ్యంగా నవదీప్ మనస్తత్వం చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఇందులో ఒక సీన్ లో నవదీప్ న్యూడ్ గా, రెండు సన్నివేశాల్లో హీరోయిన్ పంఖురి టాప్ లెస్ గా కనిపించడం గమనార్హం.

- Advertisement -

నవదీప్ 2.0 వెర్షన్…

చివరిసారిగా నవదీప్ 2020లో వచ్చిన రన్ అనే మూవీలో కనిపించాడు. ఈ మూవీ ఆహలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. అయితే ఒకప్పుడు హీరోలుగా రాణించిన కొంతమంది స్టార్స్ ప్రస్తుతం తెరమరుగైపోయారు. మరి కొంతమంది మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నవదీప్ కూడా చాలా కాలంగా ఇదే బాటలో నడుస్తున్నాడు. అవకాశాలు వస్తే హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నెట్టుకొస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కిన పాత్రలేవీ లేవు.

మరోవైపు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఫోటోలు చూసి అవకాశాలు రాక నవదీప్ ఇలా ట్రావెలింగ్ బాట పట్టాడని అన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే తాజాగా లవ్ మౌళి సినిమాలో నవదీప్ తన 2.0 వెర్షన్ ను చూపించాడు. ఈ సినిమా లుక్ లోనే గతంలో ఆయన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. కానీ అప్పుడు ఈ మూవీ గురించి ఇంకా ఎవ్వరికి తెలీదు. మొత్తానికి మరోసారి లవ్ మౌళి ట్రైలర్ తో నవదీప్ టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మరి ఇలాగైతేనే ట్రెండ్ సెట్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో గాని పెయింటర్ ప్రేమ కథలో డిఫరెంట్ గా కనిపించాడు. ఈ బోల్డ్ అటెంప్ట్ తో నవదీప్ కెరీర్ మళ్ళీ పుంజుకుంటుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు