Nagabandham Movie : డైరెక్టర్ గా మరో సినిమా… అభిషేక్ నామా ఆగేలా లేడు

Nagabandham Movie : అభిషేక్ నామా తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. డెవిల్ మూవీ ముందు వరకు ప్రొడ్యూసర్ గానే సినిమాలను నడిపించిన అభిషేక్ నామా ఇప్పుడు డైరెక్టర్ గా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెవిల్ మూవీతో దర్శకుడిగా మారిన ఈ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఇప్పుడు నాగబంధం టీజర్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

అభిషేక్ నామా ఆగేలా లేడు…

డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అభిషేక్ నామా తన తాజా సినిమాను కొన్ని రోజుల క్రితమేతో అనౌన్స్ చేశాడు. ఆ పోస్టర్ చూశాక ఈ మూవీ ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందబోతోంది అని అర్థమైంది. నాగబంధం టైటిల్ తో ఈ మిథికల్ థ్రిల్లర్ మూవీని అభిషేక్ పిక్చర్స్, థండర్ స్టూడియోస్ బ్యానర్లపై మధుసూదన్ రావు నిర్మించబోతున్నారు. అభిషేక్ నామా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా కొనసాగుతూనే, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో అభిషేక్ నామ డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ మూవీ నాగబంధం.

ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్స్ తో పాటు టీజర్ కూడా బాగుంది. టీజర్ ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లగా, అందులో హిమాలయాలు, విష్ణువు విగ్రహం ఉన్న రహస్య ప్రదేశాన్ని చూపించారు. అలాగే ఆ ప్రదేశం నాగ బంధంతో లాక్ చేసి ఉండగా, అక్కడ కేజిఎఫ్ ఫేమ్ అవినాష్ అఘోరిగా తపస్సు చేస్తూ కనిపించాడు. మొత్తానికి నాగబంధం టీజర్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ టీజర్ ను చూశాక అభిషేక్ నామా గ్రిప్పింగ్ స్టోరీ తో ఈసారి ప్రేక్షకులను పక్కాగా ఆకట్టుకుంటాడని అనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న నాగబంధం 2025లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

డెవిల్ కాంట్రవర్సీ…

డెవిల్ మూవీ కాంట్రవర్సీతో అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మధ్యలో ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ కు మెగా ఫోన్ పట్టి థియేటర్ల దాకా తీసుకొచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీకి డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ నిర్మాత, డైరెక్టర్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో నవీన్ మేడారం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో డెవిల్ మూవీకి దర్శకుడిగా తన పేరును వేసుకున్నారు అభిషేక్.

మూవీ రిలీజ్ అయ్యాక కూడా వీరిద్దరి మధ్య విభేదాలు నడిచాయి. సోషల్ మీడియా వేదికగా డెవిల్ నా సినిమా అంటే నా సినిమా అంటూ అటు నవీన్ మేడారం, ఇటు అభిషేక్ నామ ఇద్దరూ వాదులాడుకున్నారు. ఏదేమైనా డెవిల్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే డైరెక్టర్ గా అభిషేక్ అక్కడితో ఆగిపోకుండా, మరో కొత్త ప్రాజెక్టుతో మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే డైరెక్టర్ గా అభిషేక్ నామ ఇక ఆగేలా కనిపించడం లేదు. నాగబంధం మూవీ గనక హిట్ అయితే డైరెక్టర్ గా ఆయన మరింత స్పీడ్ గా దూసుకెళ్లే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు