Manchu Manoj and Mounika blessed with Baby Girl : తండ్రైన మంచు మనోజ్… పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మౌనిక

Manchu Manoj and Mounika blessed with Baby Girl : టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ పాప పేరును కూడా బయట పెట్టేసింది. ఇంతకీ మంచు మనోజ్ కు పుట్టిన ప్రిన్సెస్ పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

రీసెంట్ గా మౌనిక సీమంతం నంద్యాలలో సింపుల్ గా బంధుమిత్రుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చ్ 3న పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనిక జంట తాజాగా తల్లిదండ్రులయ్యారు. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ ద్వారా ఈ సెలెబ్రిటీ కపుల్ ను విష్ చేస్తూ, పాప పుట్టిందనే విషయాన్ని వెల్లడించింది.

మంచు లక్ష్మి చేసిన పోస్ట్ ప్రకారం ఈరోజు అంటే ఏప్రిల్ 13న ఉదయం 11 గంటల సమయంలో మౌనిక బేబీ గర్ల్ కు జన్మనిచ్చింది. ఆమె తన అన్నయ్యతో సరదాగా గడుపుతోంది అంటూ, న్యూ బార్న్ బేబీ పేరును కూడా బయట పెట్టేసింది మంచు లక్ష్మి. ఆ పాపను ఎంఎం పులి అనే నిక్ నేమ్ తో పిలుస్తున్నాం అంటూ, శివుడి ఆశీర్వాదాలు మంచు మనోజ్ ఫ్యామిలీకి ఎప్పుడూ అండగా ఉండాలని, ఆయన వాళ్ళను ఆశీర్వదించాలని కోరుకుంది. ఇప్పుడే వాళ్ళు నలుగురు అయ్యారు అంటూ ఆ పోస్టును మొదలు పెట్టి పులి దగ్గర ఓ పాప పడుకున్న ఫోటోను, ఆ తర్వాత ఓ బైక్ పై భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్న యానిమేటెడ్ ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. దీంతో మంచు మనోజ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇద్దరికీ రెండో పెళ్లి… దివంగత రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి భూమా శోభా రెడ్డి దంపతుల రెండవ కుమార్తె నాగ మౌనికను మంచు మనోజ్ తో ఈ ఏడాది మార్చ్ 3న పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

మంచు మనోజ్ 2017లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి బంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో 2019లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత చాలాకాలం ఒంటరిగా ఉన్న మనోజ్ భూమా మౌనిక రెడ్డిపై మనసు పడ్డారు. ఇక ఇప్పటికే భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఓ బాబు ఉన్నారు. ఇప్పుడు మంచు మనోజ్ తో రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.

కవలలు అంటూ రూమర్స్…
ఇక భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ అనే వార్తలు బయటకు రాగానే ఆమెపై లేనిపోని ప్రచారాలు మొదలు పెట్టారు కొందరు. మౌనిక కవలలకు జన్మనివ్వబోతోందని వార్తలు రాగా, మనోజ్ స్పందిస్తూ అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. అప్పటికి మౌనిక ఏడో నెల గర్భిణీ మాత్రమేనని, మే నెలలో తమ ఇంటికి రాబోతున్న న్యూ బార్న్ బేబీ కోసం వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన అనుకున్న దానికంటే ముందే మంచు ప్రిన్సెస్ పుట్టేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు