Birthday Blue : బర్త్ డే రోజు సంతోషంగా కాకుండా బాధగా అనిపిస్తోందా? ఈ జబ్బు లక్షణమే అది

Birthday Blue : పుట్టిన రోజు అనేది అందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. చాలా మంది ఈ స్పెషల్ డే ను తన కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకుంటారు. మరి కొంతమంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇక చిన్నపిల్లలయితే ఈరోజు కోసం ప్రతి రోజూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బర్త్ డే రోజున ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి, పూజ చేసి, కొత్త బట్టలు ధరించి చేసే ఆ హడావిడి అంతా కాదు. ఇక స్కూల్ టైంలో బర్త్ డే వస్తే ఏదో సెలబ్రిటీ ఫీలింగ్ రావడం పక్కా. కొత్త బట్టలు ధరించి స్కూల్ అంతా తిరుగుతూ టీచర్లకు, స్టూడెంట్స్ కు చాక్లెట్స్ పంచడం అనేది ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అద్భుతమైన మెమొరీ అవుతుంది.

ఇక ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడం మరో అద్భుతమైన ఫీలింగ్. ఆ రోజంతా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉత్సాహంగా గడుపుతారు. అయితే పెరిగే కొద్దీ బిజీ కారణంగా బర్త్ డే అర్థం కూడా మారుతూ వస్తుంది. కొన్నిసార్లు స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటే, మరికొన్నిసార్లు ఒంటరిగా గదిలో కూర్చొని పుట్టిన రోజును ఒక్కరే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది బర్త్ డే రోజున కూడా నిరుత్సాహంగా ఉంటారు. కొంతమంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు బాధపడడం మొదలు పెడతారు. దీన్నే బర్త్ డే బ్లూ అని పిలుస్తారు.

బర్త్ డే బ్లూ అంటే ఏంటి ?

కొంతమందికి బర్త్ డే రోజు సంతోషానికి బదులుగా బాధ కలుగుతుంది. ఆ రోజంతా ఒత్తిడిగా ఉంటారు. ఎవరైనా బర్త్ డే విషెస్ చెప్పినా లేదా పార్టీ గురించి ప్రస్తావించినా కారణం లేకుండానే చిరాకు, కోపం ముంచుకొస్తాయి. ఇదేమి సాధారణమైన విషయం కాదు. ఒక రకమైన మానసిక వ్యాధి. అందుకే దీన్ని బర్త్ డే బ్లూ అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవాళ్లు బర్త్ డే గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.

- Advertisement -

బర్త్ డే బ్లూకి కారణాలేంటి?

సైకాలజిస్ట్ క అభిప్రాయం ప్రకారం మునుపటి పుట్టిన రోజున ఏదైనా నెగిటివ్ సంఘటన, లేదా జీవితంలో మర్చిపోలేని పెయిన్ అనుభవిస్తే అది బర్త్ డే బ్లూకు కారణం కావచ్చు. మరోవైపు జీవితం చరమాంకంకు చేరుతున్నపెద్దలు పుట్టిన రోజు వచ్చిందంటే ఉద్వేగ భరితంగా ఉంటారు. ఇక మరికొంత మంది సోషల్ మీడియా పుణ్యమా అని తమ పుట్టిన రోజును ఇతరుల పుట్టిన రోజుతో పోల్చుకొని సంతోషంగా ఉండాల్సిన సమయంలో బాధపడుతూ ఉంటారు.

బర్త్డే బ్లూస్ ను ఎలా మేనేజ్ చేయాలి?

పుట్టినరోజు నాడు ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ లేదా బాధగా అనిపిస్తే ముందుగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆ బాధను పక్కకు పెట్టి పాజిటివ్ ఫీలింగ్ తో డేను స్టార్ట్ చేయండి. దాని కోసం యోగా లేదా వ్యాయామం చేయడం బెటర్. లేదంటే థెరపిస్ట్ సహాయంతో బర్త్ డే బ్లూస్ కు కారణమైన జ్ఞాపకాలకు గుడ్ బై చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు