Suma kanakala: యాంకర్ గా సక్సెస్ అవడం వెనుక ఇంత కథ ఉందా..?

Suma kanakala.. సాధారణంగా ఎవరైనా సరే ఒక రంగంలో సక్సెస్ అయ్యారు అంటే ఆ సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అది రాజకీయ రంగమైనా..సినిమా రంగమైనా.. ఇక సినిమా రంగం విషయానికి వస్తే.. ఏకంగా 24 విభాగాలలో ఒక్కొక్కరు ఒక్కో విభాగాన్ని ఎంచుకొని ..అందులో సత్తా చాటుతూ మరొక విభాగంలోకి అడుగుపెడుతూ ఉంటారు ..ఈ క్రమంలోనే బుల్లితెరపై కూడా యాంకర్ గా సత్తా చాటుతూ.. నేడు బుల్లితెర ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న సుమా కనకాల ఈ స్టేజ్ కు రావడానికి ఆమె ఎంత కష్టపడ్డారో ఇట్టే అర్థమవుతుంది.. అయితే సుమ యాంకర్ గా సక్సెస్ అవ్వడం వెనక ఎంత పెద్ద కథ ఉందో ఇప్పుడు చూద్దాం..

Suma kanakala.. Is there a story behind being successful as an anchor..?
Suma kanakala.. Is there a story behind being successful as an anchor..?

యాంకర్ గా సక్సెస్ అవ్వడానికి కారణం..
గత 20 సంవత్సరాల బుల్లితెర ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.. అయితే సుమా కనకాల ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఒక షో అట.. ఏమిటా షో అనే విషయానికొస్తే.. అదే “అవాక్కయ్యారా షో “.. నటిగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో కెరియర్ పరంగా కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన తర్వాత 2004లో ఈ షో తో రీఎంట్రీ ఇచ్చింది సుమ.. ఈ షో కి మొదటి మూడు రోజులపాటు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.. కానీ ఈ షో సక్సెస్ కావడం కష్టమే అని అనుకుంది సుమ.. అయితే ఊహించని విధంగా తరువాత రోజుల్లో సక్సెస్ రావడం జరిగింది.. ఇక సుమా ఇప్పుడు పరిమితంగా షోలు చేస్తున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాత్రం తన హవా ఇప్పటికీ కొనసాగుతోంది.. మొత్తానికి అయితే ఆ ఒక్క షో సుమను యాంకర్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు..

ప్రీ రిలీజ్ అంటే సుమా ఉండాల్సిందే..
ఇకపోతే పెద్ద హీరోలైనా.. చిన్న హీరోలైనా సరే సుమ కచ్చితంగా ఉండాల్సిందే.. ముఖ్యంగా ఈ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సుమ హోస్ట్ గా చేసిందంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే సుమను ప్రత్యేకంగా అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ నిర్మాతలు ఆమెను హోస్ట్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు తీసుకొస్తూ ఉంటారు.. ఇలా ఒకవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా చేస్తూనే.. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షో లకు యాంకర్ గా కూడా చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది.

- Advertisement -

సుమ కనకాల వ్యక్తిగత జీవితం..
కేరళకు చెందిన సుమ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజీవ్ కనకాలను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మకి ఒక కొడుకు , కూతురు కూడా జన్మించారు కొడుకు రోషన్ కనకాల ఇప్పుడు బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.. త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు రోషన్ కనకాల. తల్లిగా ఒకవైపు కొడుకు బాధ్యతలను నిర్వర్తిస్తూనే..మరొకవైపు తన కెరీర్ ను చూసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు