Nora Fatehi: ఆ పనికి నాకు మగవాడి అవసరం లేదు..!

Nora Fatehi: దేశంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతూ ఉంటారు. ఆ ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసేందుకు ఇతర దేశాల నుంచి కూడా హీరోయిన్లు వస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో నోరా ఫతేహి ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది ఈ హాట్ బ్యూటీ నోరా ఫతేహి అని చెప్పవచ్చు.

ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెనడా దేశానికి చెందిన ఈ హార్ట్ బ్యూటీ నోర… ఇండియాలోనే సెటిల్ అయిపోయింది. ఇక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఐటమ్ సాంగులు… స్పెషల్ సాంగులు… సినిమాలలో హాట్ పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో ఈ బ్యూటీ నటించి అందరిని మెప్పించింది. అందుకే కెనడా దేశం నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన టాలెంట్ను మొత్తం ఇక్కడ చూపించేసింది.

ఆమె దగ్గర ఉన్న టాలెంట్ ను దర్శక నిర్మాతలు కూడా బాగా వాడుకున్నారు. ఇక గతంలో దర్శకుడు రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్లో బాహుబలి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది నోరా ఫతేహి. అయితే సోషల్ మీడియాలో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.

- Advertisement -

ఏ హీరోయిన్ ఇంతలా అన్ని విప్పి చూపించదు. అంతలా టెంప్ట్ చేసేలా అందాలను ఆరబోస్తూ ఉంటుంది నోరా ఫతేహి. అయితే తాజాగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది డబ్బు మరియు ఫేమ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారని బాలీవుడ్ బ్యూటీ నోరా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మాత్రం దానికోసం మగవాడు ఎందుకు అంటూ బాంబు పేల్చింది. ప్రేమించినట్లు నటించి డబ్బు మరియు పేరు కోసం వారు తాపత్రయ పడుతున్నారని తెలిపింది.

ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నారు… వారి కెరీర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని తెలిపింది. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్ లో జీవిస్తున్నారని… వారు ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలేదని తెలిపింది హీరోయిన్ అన్నారా ఫతేహి. అంతేకాకుండా తన 14 సంవత్సరాల అప్పటినుంచి ఇప్పటివరకు ఉపవాసం ఉంటున్నానని తెలిపింది.

తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటానని… అసలు ఆ విషయం మరిచిపోనని నోరా ఫతేహి అన్నారు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని… ఆ తప్పులను కడుక్కోవడానికి దేవుని ప్రార్థిస్తుంటారని ఆమె వెల్లడించారు. 14 సంవత్సరాల నుంచి తాను రంజాన్ ఉపవాసం ఉంటున్నానని తెలిపారు. అది నాలో చొచ్చుకు పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు నోరా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు