Jabardasth Nukaraju: గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్.. అది నచ్చలేదంటూ షాక్..!

Jabardasth Nukaraju.. బుల్లితెర పై గత 14 సంవత్సరాలుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షక ఆదరణ పొందిన ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది తమ ఉనికిని చాటుకున్నారు .మరి కొంతమంది ఏకంగా సినిమాలలో హీరోలుగా, కమెడియన్లుగా కొనసాగుతూ పేరు సొంతం చేసుకున్నారు.. ఈ క్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జబర్దస్త్ వేదికపై అడుగుపెట్టి.. ఆ తర్వాత కాలంలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు గెటప్ శ్రీను అంత రేంజ్ లో రకరకాల గెటప్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ నూకరాజు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. జబర్దస్త్ స్టేజ్ పై తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అటు జడ్జ్ లను, ఇటు ఆడియన్స్ మెప్పిస్తున్న నూకరాజు కి సంబంధించిన ఒక వార్త తాజాగా నెట్టింట వైరల్ గా మారింది..

Jabardasth Nukaraju: Nukaraju breakup with Asia..
Jabardasth Nukaraju: Nukaraju breakup with Asia..

గర్ల్ ఫ్రెండ్ కి బ్రేక్ అప్..
ఇకపోతే నూకరాజు తన తోటి నటి లేడీ కమెడియన్ ఆసియాను ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జబర్దస్త్ షోలో రివీల్ చేసిన నూకరాజు అప్పుడప్పుడు ఆసియా యూట్యూబ్ ఛానల్ లో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు.. అంతే కాదు వీరిద్దరూ వెకేషన్ లకి వెళ్లడం, టూర్, ట్రిప్ అంటూ చేసే సందడి అంతా ఇంతా కాదు.. ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటారు ..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.. అయితే కొద్ది రోజుల క్రితం నుంచీ ఆసియా షోలో కనిపించడం లేదు.. నూకరాజు మాత్రం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి షోలలో కమెడియన్ గా కొనసాగుతున్నారు.. ఆసియాను పెళ్లి చేసుకోనప్పటికీ ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించి.. పలు వీడియోలు చేసి చేయిస్తూ సపోర్టుగా నిలుస్తున్నారు నూకరాజు.. అయితే తాజాగా తన ప్రియురాలు ఆసియా కి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు నూకరాజు.. బిగ్ బాస్ బ్యూటీ హోస్ట్ గా చేస్తున్న కాఫీ విత్ శోభా శెట్టి ప్రోగ్రాం కి వచ్చిన నూకరాజు తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు..

కంటతడి పెట్టుకున్న ఆసియా..
షో లో భాగంగా నూకరాజు ప్రియురాలికి ఫోన్ చేసి.. “నాకు నువ్వు నచ్చలేదు.. నేను నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను” అని చెప్పాడు.. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆసియా..” ఏమైందిరా.. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా మాట్లాడుతున్నావు?” అంటూ ఏడ్చేసింది..ఆ తర్వాత “నీకు నేను నచ్చకపోయినా ఓకే.. కానీ బ్రేకప్ చెప్పడానికి కారణం ఏంటో చెప్పమని” వేడుకుంటుంది.. దీంతో నూకరాజు పక్కనే ఉన్న కమెడియన్ పంచ్ ప్రసాద్ ఫోన్ తీసుకొని మాట్లాడుతారు.. దీంతో అసలు విషయం అర్థమైంది ఆసియా ఫ్రాంక్ అని తెలుసుకొని ఎక్కడున్నావురా అని అడిగి తర్వాత కాల్ కట్ చేస్తుంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో ఇది చూసిన వారందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు.. మొత్తానికైతే నూకరాజు చేసిన ఈ ఫ్రాంక్ వీడియో ఆసియా ను బాగా ఏడిపించేసిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు