Raveena Tandon: దానికి నేను కూడా గురయ్యాను

కే.జి.ఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమీకాసేన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించి ఒక్కసారిగా అందరి చూపు తన వైపుకు తిప్పుకున్న రవినా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 90 దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈ తార.. కే.జి.ఎఫ్ 2 సినిమాతో సౌత్ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలు కూడా ఆమె నటనని మరోసారి మెచ్చుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం తనకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది.

బాలీవుడ్ లో పత్తర్ కే పూల్ అనే సినిమాతో 1991లో ఎంట్రీ ఇచ్చిన రవీనా.. 1993 లో బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవినా టాండన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శరీరాకృతిని కించపరిచే బాడీ షేమింగ్ కి తాను కూడా గురయ్యానని చెప్పుకొచ్చింది.

“అప్పట్లో ప్రతి సెలబ్రిటీకి వారి ఆకృతిని బట్టి ఒక పేరు పెట్టేవారు. అలా నన్ను కూడా థండర్ థైస్ అని వర్ణిస్తూ వార్తలు రాసేవారు. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ మేగజైన్స్ కు మహిళలు ఎడిటర్స్ గా ఉండేవాళ్లు. వారు ఏ హీరో అయినా ఫలానా హీరోయిన్ కి వ్యతిరేకంగా వ్యాసాలు రాయాలని చెబితే ఆ మాటే వేదంగా పాటించేవారు. ఒకవేళ ఎవరైనా హీరోయిన్ ఎదురు తిరిగితే పేజీ కింద క్షమాపణ పేరుతో సవరణలు వేసేవారు. కానీ అప్పటికే ఆ హీరోయిన్ గురించి ప్రజల్లోకి చెడు ప్రచారం వెళ్ళిపోయేది. అలా నా మీద కూడా బాడీ షెమింగ్ చేశారు. అలా ప్రచారం చేసిన మహిళనే నేడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు